క‌రోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. మ‌న‌దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 1076 కేసులు న‌మోదు కాగా.. 32 మంది మ‌ర‌ణించిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,385 చేరింది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 452 మంది మ‌ర‌ణించారు. 1766 మంది కోలుకోగా.. 11616 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు కేంద్రం తెలిపింది. 3205 కేసుల‌తో మ‌హ‌రాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో 194 మంది మ‌ర‌ణించ‌గా.. 300 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1640 కేసుల‌తో ఢీల్లిలో రెండో స్థానంలో ఉంది. ఇక వెయ్యికి పైగా కేసులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో న‌మోద‌య్యాయి.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.