షహదాత్ హుస్సేన్ : అతనిపై నిషేధం ఏడాది కాదు.. ఐదేళ్లు.!
By Medi Samrat Published on 19 Nov 2019 5:47 PM IST
ముఖ్యాంశాలు
- ఆరాఫత్ సన్నీపై దాడి
- గతంలోనూ నిషేదం
- రెండేళ్ల సస్పెన్షన్ తో పాటు.. 60 నెలలు నిషేధం
మైదానంలో తోటి క్రికెటర్‌పై దాడికి పాల్పడ్డ బంగ్లాదేశ్ క్రికెటర్ షహదాత్ హుస్సేన్ ఏడాది పాటు నిషేదానికి గురయ్యాడు అంటూ సోమవారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై విధించిన నిషేదం ఏడాది కాదు.. ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందులో రెండేళ్లు సస్పెండ్ చేసింది. ఐదు సంవత్సరాలతో పాటు నిషేధంతో పాటు మూడు లక్షల టాకాల జరిమానా కూడా విధించింది. అయితే ఈ నిషేధాన్ని అంగీకరిస్తున్నట్లు షహదత్ హుస్సేన్ ప్రకటించాడు. ఈ శిక్షను మ్యాచ్ రిఫరీ విధించి.. ఆ తర్వాత పరిశీలన నిమిత్తం బోర్డు టెక్నికల్ కమిటీకి పంపించారు. బోర్డు.. ఆటగాడికి నిషేధం, జరిమానా విధించడాన్ని సమర్థించింది.
వివరాళ్లోకెళితే.. బంగ్లా దేశవాళీ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఢాకా డివిజన్-ఖుల్నా డివిజన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షహదాత్ ఈ దాడికి పాల్పడ్డాడ్డు. షహదత్ బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతుండగా సహచర ఆటగాడు అరాఫత్ సన్నీ బంతిని ఒకవైపే రుద్దవద్దని సూచించాడు. అలా రుద్ది ఒకవైపే షైన్ చేయొద్దని చెప్పడంతో షహదత్ మండిపడ్డాడు. అంతేకాదు, నేరుగా అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.
దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)సీరియస్ అయ్యింది. జట్టులోని సహచర ఆటగాడిగాపై చేయి చేసుకున్న షహదాత్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే.. లెవల్ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా షహదాత్‌పై రెండేళ్ల సస్పెన్షన్ తో పాటు.. 60 నెలలు నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే.. నిషేధం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ నుంచి షహదత్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఆరాఫత్ సన్నీ మాట్లాడుతూ... 'బంతిని ఒక వైపే మెరుపు చేయడం మంచి పద్ధతి కాదు. ఇదే విషయాన్ని షహదాత్ హుస్సేన్ కు చెప్పా. అతను నాతో గొడవకు దిగాడు. ఆ సమయంలోనే నాపై చేయి చేసుకున్నాడు' అని తెలిపాడు.
ఈ వివాదంపై షహదాత్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ నేను సస్పెండ్ అయిన కారణంగా ఎన్‌సీఎల్ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఏమవుతుందో చెప్పలేను. నా సహనాన్ని కోల్పోయిన మాట వాస్తవం. కానీ అతను కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతన్ని చేయి చేసుకునే వరకూ వెళ్లాల్సి వచ్చింది. నేను బంతిని షైన్ చేస్తుంటే వద్దన్నాడు. ఎందుకు అని అడిగా. కానీ గట్టిగా అరుస్తూ నన్ను ఏదో అన్నాడు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ క్రమంలోనే కొట్టాల్సి వచ్చింది’ అని తెలిపాడు.
ఇది మొదటిసారేం కాదు..!
అయితే.. 2015లో బంగ్లా తరఫున చివరిసారి ఆడిన షహదాత్ 38 టెస్టులు ఆడి 72 వికెట్లు తీశాడు.ఇక 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు. 2015లో ఒకసారి షహదాత్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. భార్యను వేధించిన కేసులో షహదాత్ ఇరుక్కోవడంతో బోర్డు అతనిపై నిషేధం విధించింది. ఆపై కొన్ని నెలల తర్వాత షహదాత్ అభ్యర్థన మేరకు నిషేధాన్ని సడలించి దేశవాళీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇచ్చింది.