జొమాటోకి లక్ష రూపాయల జరిమానా
By సత్య ప్రియ Published on 21 Oct 2019 11:36 AM IST
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చెన్నై కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. చెన్నైలో డెంగీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.
అపరిశుభ్రంగా కనిపించిన సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలోని చేట్‌పెట్ ఎంసీ నికల్సన్ రోడ్డులోని ఓ భవనంలో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న జొమాటో బ్యాగులను గుర్తించిన అధికారులు ఆ సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించారు.
ఆ బ్యాగులలో వర్షపు నీరు నిలిచిపోయి దోమలు పెరగడానికి అనువుగా ఉండడాన్ని అదికారులు తప్పుబట్టారు.
Next Story