రాశులు వాటి ఫలాలు(ఆదివారం - శనివారం)

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 6:09 AM GMT
రాశులు వాటి ఫలాలు(ఆదివారం - శనివారం)

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం జీవిత భాగస్వామితో కాస్త ప్రతికూలంగా ఉండును. ప్రయాణాలు ఉండును. బుధ వీక్షణ వలన ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. 6 ఇంట రవి, కుజుల వల్ల శత్రుజయం. కోర్టు వ్యవహారములు కలిసి వచ్చును. సంతాన స్థానాధిపతి 6వ ఇంటి స్థితి వలన సంతానము తో కాస్త చికాకులు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురు స్థితి వలన ఆరోగ్యం తక్కువ. భాగ్య స్థానంలో శని స్థితి వలన అనుకున్న పనులు పట్టుదలతో సాధిస్తారు. వృత్తి రీత్యా అభివృద్ధి. వ్యయ స్థానానికి గురు వీక్షణ వల్ల సత్ కార్యములకు ఖర్చు చేస్తారు. అశ్విని నక్షత్రమునకు పై ఫలితాలు ఎక్కువగా సిద్ధించును. కృత్తిక ప్రధమ పాదమునకు 75%, భరణి నక్షత్రము నకు యోగములు స్వల్పముగా ఉండును.

పరిహారం:

ఆరోగ్యంలో చికాకులు, జీవిత భాగస్వామితో ప్రతికూలత తొలగుటకు శ్రీమహావిష్ణువును ఆరాధించుట, పెసలు దానం చేయుట, ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయుట శుభ ఫలితములను ఇచ్చును.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ధన స్థానములో రాహువు ఉండుట, ధనాధిపతి 6 ఇంట స్థితి వలన ఆర్థిక ఇబ్బందులు ఉండును. నేత్ర సంబంధ వ్యాధులకు అవకాశం. హృదయ స్థానము లో పాప గ్రహ స్థితి వలన నీలాపనిందలు కలుగును. పంచమాధిపతి షష్ఠ స్థానంలో స్థితి వలన బుద్ధిమాంద్యం ఉండును. కానీ పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు ఉండుటవలన జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించును. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును. స్వస్థానంలో కంటే పర స్థానములో రాణిస్తారు. అష్టమ శని వలన అనారోగ్యం ఉన్నను గురు వీక్షణ వలన కాస్త సానుకూలంగా ఉంటుంది. వృత్తి స్థానాధిపతి అష్టమ శని వలన వృత్తి రీత్యా చికాకులు. లాభ స్థానానికి గురు వీక్షణ వల్ల సమయానికి స్నేహితుల సహాయం లభించును. వ్యయ స్థానానికి బుధ వీక్షణ వల్ల వైద్యపరమైన వ్యయం అగును. కృత్తికా నక్షత్ర జాతకులకు పై ఫలితాలు సంపూర్ణంగా వర్తించును. రోహిణి నక్షత్ర జాతకులకు 50%, మృగశిర నక్షత్ర జాతకులకు 75%ఫలితం లభించును.

పరిహారం:

పంచమ రవి కుజులు, అష్టమ శని స్థితి దోషం కావున పరమేశ్వరుని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించుట మంచిది. తెలుపు రంగు వస్త్రధారణ, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

మిధునం రాశి :

ఈ రాశి వారికి లగ్న రాహువు, సప్తమ శని కేతుల వలన భార్య భర్తల విరోధం, ఎడబాటు ఉండును. హృదయ స్థానాలలో రవి కుజులు వలన బంధు విరోధం. షష్ఠ గురు స్థితి వలన యశస్సు నశిస్తుంది. పంచమంలో బుధ స్థితి వలన సంతాన చికాకులు, బుద్ధికుశలత ఉండదు. కార్య విఘ్నములు, వాహన ప్రమాదములకు అవకాశము కావున ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మాతృ వర్గంతో విరోధములు అధికముగా ఉండును. నూతన గృహ నిర్మాణానికి విఘ్నం కలుగును. విద్య, వృత్తి పరంగా బాగుండును. లాభ స్థానమునకు బుధ వీక్షణతో స్నేహితుల వల్ల లాభం. లగ్నంలో రాహువు, సప్తమ శని కేతువు వల్ల నరములకు, రక్తమునకు సంబంధించిన వ్యాధులకు అవకాశం. మృగశిర నక్షత్ర జాతకులకు పూర్ణ ఫలితము. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు 75% అనుకూలం. పునర్వసు నక్షత్ర జాతకులకు వ్యతిరేక ఫలితాలు అధికముగా ఉండును.

పరిహారం:

రవి కుజులు చతుర్ధ స్థాన స్థితి వలన సూర్య నమస్కారములు చేయుట మంచిది. ఎరుపు వస్త్రధారణ, తూర్పు దిశ ప్రయాణం లాభించును. గోధుమలు బెల్లం కలిపి ఆవుకు తినిపించిన శుభ ఫలితం.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి తృతీయ స్థానంలో పాపగ్రహములు, చతుర్థ పంచమములలో శుభగ్రహములు. షష్ట స్థానములో శని కేతువు వలన విశేష శుభ ఫలితములు. సోదర సహకారము, ధైర్యసాహసములు ఉండును. వాహన గృహయోగాలు కలవు. పంచమ స్థానాధిపతి భాగ్య స్థితి వలన విద్యా యోగం, బుద్ధికుశలత, తండ్రి సహకారం, కుటుంబ సహకారం లభించును. కానీ సప్తమాధిపతి శత్రు స్థానములో ఉండుట, సప్తమ గ్రహాన్ని కుజుడు వీక్షించుట వలన భార్యాభర్తల వియోగం ఏర్పడును. అష్టమ స్థానాన్ని శని వీక్షించుట వల్ల శిరస్సు కు సంబంధించిన సైనస్, తలనొప్పి వంటి వ్యాధులకు అవకాశం. భాగ్య స్థానానికి గురు వీక్షణ వల్ల కీర్తి పెరుగును. దశమాధిపతి 3 వ స్థానములో స్థితి వలన వృత్తిరీత్యా బాగుండును. వ్యయ స్థానములో రాహువు స్థితి వల్ల కాస్త దుడుకుతనం, కోపం వల్ల స్వయంకృత అపరాధాలు ఏర్పడును. పునర్వసు నక్షత్ర జాతకులకు అనుకూలం 50%, పుష్యమి నక్షత్ర జాతకులకు అధికంగా శుభప్రదం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు స్వల్ప శుభ ఫలితాలు.

పరిహారం:

శ్రీ మహాలక్ష్మి ఆరాధన, ఎరుపు వస్త్రధారణ, పుణ్య క్షేత్ర సందర్శన శుభ ఫలితాలను ఇచ్చును.

సింహరాశి:

ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో రవి, కుజుల స్థితి వలన వాగ్వాదములు, నేత్ర సంబంధ అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు ఉండును. కానీ హృదయ స్థానంలో గురుస్థితి వలన ధైర్యం సాహసం తో ముందుకు సాగుతారు. బంధు సహకారం పుష్కలం. పంచమ శని కేతువుల వలన సంతాన చికాకులు, విద్యా విఘ్నములు ఉండును. భార్యాభర్తల మైత్రి తక్కువ. వృత్తిరీత్యా చికాకులు. తండ్రితో మైత్రి బాగుండును. లాభము నందు రాహువు వలన పుణ్యక్షేత్ర దర్శనం. వ్యయాధిపతి కుటుంబ స్థానంలో స్థితి వలన కుటుంబ పరంగా అధిక వ్యయము. మఖా నక్షత్ర జాతకులకు అధిక సంఖ్యలో శుభ ఫలితాలు. పుబ్బ నక్షత్ర జాతకులకు స్వల్పంగా శుభఫలితాలు. ఉత్తర నక్షత్ర జాతకులకు 75% అనుకూలం.

పరిహారం:

పరమేశ్వరుని పూజించుట, గోధుమరంగు వస్త్రధారణ, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

కన్యారాశి:

ఈ రాశివారికి ఈ వారము కాస్తా అనారోగ్యం. కాని.. ధనమునకు లోటు ఉండదు. సోదర సహకారం లభ్యమగును. ఆహార నియమాలలో మార్పులు వచ్చును. ధైర్యసాహసములతో ముందుకు సాగుతారు. అర్ధాష్టమ శని వలన తల్లికి అనారోగ్యం. గృహంలో ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును. వాహన ప్రమాదము లకు అవకాశం ఉండుటవలన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. విద్యా, సంతానము, భార్య భర్తల మైత్రి, కుటుంబ సభ్యుల సహకారం ఉండును. వృత్తిరీత్యా బాగుండును. లాభాధిపతి లగ్న స్థితి వలన స్వతంత్ర జీవనమును వ్యయాధిపతి లగ్నస్థితి వలన అనవసర ఖర్చులు. ఉత్తరా నక్షత్ర జాతకులకు అధికంగా బాగుండును. కానీ ఆరోగ్యం తక్కువ. హస్తా నక్షత్ర జాతకులకు కార్యసిద్ధి. చిత్తా నక్షత్ర జాతకులకు కష్టేఫలి.

పరిహారం:

శ్రీమహావిష్ణువుని పూజించుట, తెలుపురంగు వస్త్రధారణ, ఉత్తర దిశ ప్రయాణం శుభకరం.

తుల రాశి:

ఈ రాశి వారికి అధిక సంఖ్యలో వ్యయమందు గ్రహములు ఉండటం వలన ధన వ్యయము, ఆరోగ్యం క్షీణించటం, కార్య విఘ్నములు ఉండును. కానీ లగ్నములో బుధ స్థితి వలన బుద్ధికుశలత ఉండును. ధన కారకుడు ధనస్థానములో ఉండుటవలన సమయానికి ఆర్థిక సహాయం అందును. ధైర్యసాహసములతో ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామికి అనారోగ్యం. వృత్తిరీత్యా ఇబ్బందులు. భాగ్య రాహువు వలన యశో నాస్తి. లగ్నములో బుద్దుడు, ధన స్థానంలో గురుడు యోగించును. కానీ అధిక గ్రహములు దుష్ట స్థానములో ఉండుట వలన ఈ వారం అవయోగమే ఎక్కువ. చిత్తా నక్షత్ర జాతకులకు పై యోగములు 50% సిద్ధించును. స్వాతి నక్షత్ర జాతకులకు కాస్త అనుకూల ఫలితములు ఉండును. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రతికూలం.

పరిహారం:

లలితాదేవిని పూజించుట మంచిది. బీదవారికి వస్త్రదానం, గోసేవ సత్ఫలితాలను ఇచ్చును.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి లగ్నములో గురుడు. లాభము నందు అధిక సంఖ్యలో గ్రహముల స్థితి వలన ఈ వారం విశేష శుభ ఫలితములు పొందగలరు. వాక్ స్థానము లో శని కేతువు వలన నేత్ర సంబంధిత అనారోగ్యములుండును. ఆచితూచి మాట్లాడుట మంచిది. ఈ రాశివారికి తల్లి వల్ల విశేష అనుకూలము. వాహనము, గృహయోగం సిద్ధించును. యత్న కార్యసిద్ధి. అష్టమ రాహువు వలన మతిమరుపు బద్ధకం వంటి లక్షణాలు ఉండును. తండ్రితో మైత్రి, కీర్తి ప్రతిష్టలు బాగుండును. విశాఖ నక్షత్ర జాతకులకు కాస్త వ్యతిరేక ఫలితములు. అనురాధ నక్షత్ర జాతకులకు అధిక శుభ ఫలితములు. జేష్ఠ నక్షత్ర జాతకులకు 50% శుభం.

పరిహారం:

ఈ రాశి వారికి గురు బలం వల్ల విశేష కార్యసిద్ధి. శివారాధన, గోసేవ, తెలుపు ,గోధుమ రంగు వస్త్రధారణ శుభములను ఇచ్చును. ఉత్తర, దక్షిణ దిశలలో ప్రయాణం అనుకూలం.

ధనూరాశి:

ఈ రాశివారికి ఏలినాటి శని, వ్యయ గురుని వలన అనారోగ్యములు, ఆర్ధిక ఇబ్బందులు, మానసిక దౌర్బల్యం మరియు వృత్తిరీత్యా చీకాకులు ఉండును. విద్యా విఘ్నములు, సంతానంలో చికాకులు, గర్భస్రావాలు , బుద్ధి మాంద్యం ఉండను. విదేశీ ప్రయాణములు ప్రతికూలంగా ఉండును. భార్యా భర్తల మైత్రి తక్కువ. పితృ విరోధము ,ధన నష్టము ప్రయాణ నష్టము ఉండును. దశమ కేంద్ర మందు శుక్ర స్థితి వలన ఓటమిని అంగీకరించాలి. లాభ స్థానంలో బుధ స్థితి వల్ల మాతృవర్గం వారిలో అనుకూలం. మూలా నక్షత్ర జాతకులకు కాస్త శుభ ఫలితం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వ్యతిరేక ఫలితములు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కాస్త అనుకూల ఫలితములు ఉండును. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం కాస్త ప్రతికూలంగా ఉండును.

పరిహారం:

ఏలినాటి శని కావున శివకేశవులను పూజ పూజించుట, ఆంజనేయుని పూజించుట మంచిది. శనికి తైలాభిషేకం నల్లనువ్వులు దానం సత్ఫలితాన్ని ఇస్తాయి.

మకరరాశి:

ఈ రాశివారికి ఏలినాటి శని అయినను వ్యయ కేతువు కర్మ స్థానంలో బుధుడు లాభ స్థానంలో గురుని స్థితి వల్ల శుభ ఫలితాలు పొందగలరు. కానీ లగ్నాధిపతి వ్యయ స్థితి వలన కాస్త అనారోగ్యం ఉండును. భాగ్య స్థానంలో రవి కుజులు స్థితి వల్ల పితృవర్గాలతో కాస్త విరోధం లేదా ధన వ్యయము ఉండును. సప్తమ అధిపతి భాగ్యస్థితి వల్ల జీవిత భాగస్వామితో అనుకూలం, తల్లికి అనారోగ్యం ఉండును. విద్యా విఘ్నములు వుండును.6వ ఇంట రాహు స్థితి వలన ధైర్య సాహసాలు ఉండును. భాగ్యమును శని వీక్షణ వల్ల పుణ్యక్షేత్ర దర్శనము కలుగును. శ్రవణానక్షత్ర జాతకులకు పై ఫలితాలు స్వల్పం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సత్ఫలితములు మెండుగా ఉండును. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు 50% బాగుండును.

పరిహారం:

సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది. ఏలినాటి శని గనుక శనికి తైలాభిషేకం మంచిది. నలుపు వస్త్రధారణ. నల్ల నువ్వుల దానం సత్ఫలితాలను ఇస్తాయి. పేదలకు అన్నదానం చేయుట మంచిది.

కుంభ రాశి:

ఈ రాశివారికి లగ్నాధిపతి లాభంలో ఉండుట బుధ గురులు కర్మ ధర్మ స్థానాలలో ఉండుట విశేష కీర్తి కలుగును. అధికారికంగా బాగుండును. కుటుంబ సహాయ సహకారాలు అందును. ఆరోగ్యం బాగుండును. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. యత్న కార్యసిద్ధి, నూతన వాహన యోగం, సత్ పురుష దర్శనం లభించును. సంగీత సాహిత్యముల యందు అభిలాష, విద్యాయోగం ఉన్నది .వృత్తిరీత్యా బాగుండును. అష్టమ మందు నాలుగు గ్రహముల స్థితి వలన కాస్త అనారోగ్యము (హృదయ సంబంధ అనారోగ్యం) ఉండును. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు విశేష శుభ ఫలితాలు, శతభిషా నక్షత్ర జాతకులకు 75% శుభ ఫలితాలు, పూర్వాభాద్ర జాతకులకు సామాన్యముగా ఉండును. మొత్తం మీద ఈ రాశివారికి అనుకూల ఫలితములు గోచరించును.

పరిహారం:

గణపతి, పరమేశ్వరుని ఆరాధన, తెలుపు వస్త్రముల ధారణ, ఉత్తర దిశా ప్రయాణము అనుకూలం నూతన కార్యక్రమాలు ప్రారంభానికి మంచిది.‌

మీనరాశి:

ఈ రాశివారికి సప్తమంలో 4 గ్రహాలు ఉండటం వల్ల కుటుంబ చికాకులు, భార్యాభర్తల ఎడబాటు, స్థానచలనం ఉండును. అష్టమంలో బుధుని వలన ఉదర సంబంధ వ్యాధులు ఉండును. విద్యా విఘ్నములు. వృత్తిరీత్యా ఇబ్బందులు. కాస్త అనారోగ్యము ఉండును. వాహన ప్రమాదములు, బంధు విరోధము ఉండును. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఎక్కువ సంఖ్యలో వ్యతిరేక ఫలితములు, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కాస్త అనుకూల ఫలితములు ఉన్నను మధ్యమధ్యలో యోగభంగమునకు అవకాశం ఉన్నది. రేవతీ నక్షత్ర జాతకులకు ధన వ్యయము, కుటుంబ చికాకులు తప్పదు.

పరిహారం:

వెంకటేశ్వరస్వామిని అర్చించుట మంచిది. బంగారము దానము చేయుట, పుణ్యక్షేత్ర దర్శనము మంచివి. మొత్తంమీద ఈ వారం ఈ రాశివారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త చాలా అవసరం.

Next Story