మరో ప్రముఖ బాలీవుడ్‌ నటికి కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  23 Sep 2020 2:51 AM GMT
మరో ప్రముఖ బాలీవుడ్‌ నటికి కరోనా పాజిటివ్‌

ప్రముఖ మరో బాలీవుడ్‌ నటి కరోనా బారిన పడ్డారు. నటి జరీనా వహాబ్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు తీవ్ర జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు ఉండటంతో ఆమెకు కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా, పలు భారతీయ భాషల్లో వందలకుపైగా చిత్రాల్లో జరీనా నటించారు. చివరగా వరుణ్‌ ధావన్‌, శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌లుగా నటించిన స్టీట్‌ డ్యాన్సర్‌ 3లో నటించారు. ప్రస్తుతం తెలుగులో వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న విరాటపర్వంలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మావో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా,సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రయమణి, నందితా దాస్‌ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఆమెకు కరోనా లక్షణాలతో బాధపడుతుండటం, ఆక్సిజన్‌ లెవల్స్‌ కూడా తగ్గడంతో ప్రముఖ ఆస్పత్రిలో చేర్చి చికిత్స తీసుకున్నట్లు ఆమె భర్త ఆదిత్య పంచోలి తెలిపారు. జరీనాకు శ్వాస తీసుకోవడంతో కొంత ఇబ్బంది, కీళ్ల నొప్పులు, జ్వరం ఉన్నాయన్నారు. కాగా, కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. షూటింగ్‌లు సైతం వాయిదా పడుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు.. అనంతరం అన్‌లాక్‌లో భాగంగా మళ్లీ షూటింగ్‌లు ప్రారంభం అయ్యాయి. అయినా కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో మళ్లీ వాయిదా పడుతున్నాయి. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు.

Next Story