సోషల్ మీడియాలో యువరాజ్ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా ‘హాయ్‌ మిర్చీ’ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు యువీ. ‘హాయ్‌ మిర్చీ…. నా ప్రియ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.

ఇక యువీ సరదా ట్వీట్‌కు సానియా కూడా అంతే సరదాగా రిప్లై ఇచ్చింది. ‘హాయ్‌ మోటూ. థాంక్యూ’ అంటూ బదులిచ్చింది. కొన్ని రోజుల క్రితం కూడా యువీ గడ్డం మీద ఇద్దరూ సరదా ట్విట్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే..!

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.