యువీ గడ్డం పెంచూ గ్లామర్‌గా ఉంటావ్..!- సానియా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 8:01 AM GMT
యువీ గడ్డం పెంచూ గ్లామర్‌గా ఉంటావ్..!- సానియా

ఢిల్లీ: యువరాజ్ సింగ్ భారత క్రికెట్‌లో ఓ మెరుపు. యువీ క్రీజ్‌లో ఉన్నాడంటే బౌలర్లకు చుక్కలే. జట్టులో ఉన్నప్పటీ కంటే..జట్టులో లేనప్పుడే యువీ చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకు క్రికెట్‌ వీడ్కోలు పలకాల్సి వచ్చిందనే విషయాన్ని కొన్ని రోజులుగా అభిమానులతో షేర్‌ చేసుకుంటూనే ఉన్నాడు యువీ. తాజాగా యువీ పోస్ట్‌ చేసిన ఒక ఫోటో వైరల్‌గా అయింది. క్లీన్‌ షేవ్‌తో న్న ఫోటోను యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి ‘చిక్నా చమేలా’ అంటూ కింద క్యాప్షన్‌ ఇచ్చాడు.

తాను మళ్లీ గడ్డాన్ని పెంచాలా అని అభిమానులను అడిగాడు యువీ. దానికి సానియా పెంచితే బాగుంటావు అని అర్ధం వచ్చేలా రిప్లే ఇచ్చింది.

Next Story
Share it