నాదేళ్ల యుగంధర్ అంత్యక్రియలు పూర్తి!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2019 10:28 AM GMT
నాదేళ్ల యుగంధర్ అంత్యక్రియలు పూర్తి!

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి నాదెళ్ల యుగంధర్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానం లో పూర్తయ్యాయి. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా శేరి లింగంపల్లి సిటిజన్ హాస్పిటల్ లో తండ్రి మృతదేహం దగ్గరికి చేరుకున్నారు సత్య నాదెళ్ల. సిటిజన్ హాస్పిటల్ నుంచి నేరుగా మహాప్రస్థానానికి నాదెళ్ల యుగంధర్ మృతదేహాన్ని తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు.

మాహాప్రస్థానంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కానీ, యుగంధర్ అంత్యక్రియలను వీడియో కవరేజీకి మాత్రం పోలీసులు అనుమతించలేదు.

సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి అయిన బీఎన్ యుగంధర్(82) శుక్రవారం కన్నుమూశారు. 1962 బ్యాచ్ లో ఐఏఎస్ పాస్ అయిన యుగంధర్ తన నిరాడంబరతకూ, సేవా గుణానికి ప్రతీకగా నిలిచారు. 1983 నుంచి 1985 వరకూ ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో పని చేశారు. అప్పట్లో టిడీపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకానికి రూపశిల్పి ఈయనేనంటారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు పీఎంవోలో కూడా పని చేశారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమి డైరక్టర్ గా వ్యవహరించారు.

అనంతపురం లోని బుక్కపురం లో యుగంధర్ జన్మించారు. పేరులో పుట్టిన ఊరును జోడించుకుని బుక్కపురం నాదెళ్ల యుగంధర్ అయ్యారు. యుగంధర్ ఏకైక సంతానం సత్య నాదెళ్ల.

Next Story