శ్రీకాకుళం జిల్లా : కొత్తూరు మండలం కుంటిబద్ర గ్రామంలో పుట్టగొడుగులు విషయంలో తలెత్తిన వివాదం గొడవకు దారి తీసింది. ఇది కాస్తా రాజకీయరంగు పులుముకుని వైఎస్ఆర్ సీపీ, టీడీపీ మధ్య గొడవకు దారి తీసింది. వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్త జంగంను టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచారు. జంగం మృతి చెందాడు. గొడవలో మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని కొత్తూరు సామాజిక ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 144 సెక్షన్ విధించి, ప్రత్యేక బలగాలను మోహరించారు పోలీసులు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story