సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లపై డీజీపికి వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
By Newsmeter.Network Published on 7 Oct 2019 5:50 PM ISTఅమరావతి: సోషల్ మీడియాలో అనుచిత కథనాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు డీజీపీ సవాంగ్‌ను కలిశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, సీఎంపై మార్ఫింగ్ చేసిన ఫొటోలు యూజ్ చేయడాన్ని సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేశారు.
జనసేన, టీడీపీ నేతలు సీఎంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక పద్ధతి ప్రకారం..కుట్రలో భాగంగానే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని డీజీపీ సవాంగ్‌కు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కుటుంబ పరువు తీయడానికే టీడీపీ నేతలు, కార్యకర్తలు సంస్కారంలేని పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ ల కుట్ర వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ల ప్రమేయం ఉందని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు.
లోకేష్ చేత నియమించబడిన 2వేల మంది టీడీపీ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనిచెప్పారు వైఎస్ఆర్ సీపీ నేతలు. డీజీపీకి వైఎస్ఆర్ సీపీ నేతలు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. అసభ్యకర పోస్ట్ లు పెడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరారు వైఎస్ఆర్ సీపీ నేతలు.
గతంలో కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లపై వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ పెట్టే పోస్ట్ లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలనే బద్నాం చేయడానికి టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వింగ్ పోస్ట్ లు పెడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా వారి పెట్టే అసభ్యకర పోస్ట్ లకు పోలీసులు బ్రేక్ వేయాలని కోరారు వైఎస్ఆర్ సీపీ నేతలు.