టీడీపీ నేతలపై వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫైర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 23 Sept 2019 5:01 PM IST

విశాఖపట్నం: గత ఐదేళ్లుగా టీడీపీ నేతలు విశాఖను దోచుకున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ సీపీ నేతల పేరు వాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా ఉపేక్షించమన్నారు. విశాఖలో భూ కుంభకోణాలు చేసిందెవరో ప్రజలకు తెలుసు అన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోనే విశాఖకు మహర్ధశ పట్టిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి విశాఖకు చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయనే టీడీపీ నేతలు విష ప్రచారానికి తెరలేపారన్నారు. టీడీపీ నేతలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కమిషనర్‌ను కోరారు. వైఎస్ జగన్ పాలనలో టీడీపీ ఖ్యాతీ పెరుగుతుందన్నారు గుడివాడ అమర్నాథ్.
Next Story