వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడింది: దేవినేని ఉమా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sep 2019 12:06 PM GMT
విజయవాడ: పోలవరం విషయంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడిందన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. రివర్స్ టెండరింగ్ పేరుతో డ్రామా నడిపారన్నారు. మీకు నచ్చిన మెఘా కంపెనీకి రిజర్వ్ టెండరింగ్ కట్టబెడతారా ? అని వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత వరకు ఎవరు ఎంత కోడ్ చేశారు? ఏవిధంగా అనుమతలు ఇచ్చారో చెప్పలేకపోయారన్నారు. జీవో 99 సారాంశం..టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ని రద్దు చేయడమేనన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని దేవినేని ఉమా చెప్పారు.
Next Story