అయ్యవార్లను 'దేవుడు' కరుణించాడు..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 7:09 AM GMT
అయ్యవార్లను దేవుడు కరుణించాడు..!!

విజయవాడ: దేవుడి ధూప, దీప, నైవేద్యాలు పెట్టే బ్రాహ్మనోత్తములను దేవుడు కరుణించాడు. వారి కలను నిజం చేశాడు. నేనున్నానే అబయం ఇచ్చాడు. వంశపారంపర్య అర్చకత్వానికి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓకే చెప్పింది. జీవో నెంబర్ 439 అమలు చేయడం ద్వారా బ్రాహ్మణులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అర్చకులు సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డేనని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్రాహ్మణులు హ్యాపీగా ఉంటారని చెప్పారు. ఇక దేవుడి సేవలో నిస్వార్డంగా , సంతోషంగా పాల్గొంటారని చెప్పారు.

వైఎస్ జగన్ బ్రాహ్మణుల హితుడు: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 33వ యాక్ట్‌ను ప్రతిపాదించారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పారు. ఇది వంశపారంపర్య హక్కుల కోసమే ప్రతిపాదించారని చెప్పారు. కాని.. గత ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనలు పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్‌లో ధూప, దీప, నైవేద్యాలకు రూ.234 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇక..రూ.100 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రలో మైలురాయి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నిర్ణయంతో బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు. చరిత్రలో జగన్ నిర్ణయం ఒ మైలురాయిగా నిలుస్తుందన్నారు.

Next Story