విజయవాడ: శ్రీ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ ను సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు.అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు  . సీఎంకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు.  తలపై పట్టు వస్త్రాలను పెట్టుకుని అమ్మవారికి సాంప్రదాయ పద్దతిలో సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మూల నక్షత్ర ఘడియాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం వైఎస్ జగన్ వేద పండితుల ఆశీర్వచనం  తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్ తన పూజాకార్యక్రమాలు ముగించుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.