అమరావతి: ఈ నెల 5న ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ప్రధాని దగ్గర సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించే అవకాశముంది. ‘రైతు భరోసా’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని జగన్‌ ఆహ్వానించే అవకాశముంది. ఇక.. ప్రధాని మోదీ దగ్గర రాష్ట్ర విభజన చట్టంలో ఇప్పటి వరకు పరిష్కారం కాని అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు..రివర్స్ టెండరింగ్‌లో మిగిలిన నిధులపై కూడా ప్రధానితో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశముంది. పీపీఏ సమావేశం ఏర్పాటుకు కేంద్ర మంత్రి షెకావత్ ను ముఖ్యమంత్రి కలవనున్నారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కలిసి రాజకీయ అంశాలను ఏపీ సీఎం జగన్‌ చర్చించే అవకాశముంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.