వోల్గా వీడియోస్‌కు "యూట్యూబ్ డైమెండ్ బటన్" అవార్డు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 7:03 AM GMT
వోల్గా వీడియోస్‌కు యూట్యూబ్ డైమెండ్ బటన్ అవార్డు

అనాది కాలం నుంచి అలరిస్తూ.. వీడియో క్యాసెట్ల సంస్థల్లోనే అప్పటికీ ఇప్పటికీ నెంబర్ స్థానంలో నిలిచిన సంస్థ 'వోల్గా వీడియోస్'. నేటి యూట్యూబ్ కాలంలో కూడా మీడియా విలువలను కాపాడుతూ.. నిష్ణాతులైన సబ్బందితో నిరంతరం పురోగతిని సాధిస్తుంది. ఈ మార్గంలోనే విజయవంతంగా దూసుకెళ్తున్న వోల్గా వీడియోస్ సంస్థ కు ప్రముఖ యూట్యూబ్ సంస్థ అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించింది.

వివరాల్లోకి వెళితే.. గూగుల్ సంస్థ వారి విజయోత్సవ వేడుకలో భాగంగా.. యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యే ప్రసారల్లో అత్యున్నత నాణ్యత విలువలతో కూడిన వీడియోస్ ను ప్రసరింప చేసింది. దీంతో పాటు కోటి కి పైగా అత్యధిక సబ్ స్క్రైబర్స్ ను కలిగి బిలియన్ల వ్యువర్స్ ను పొందుతున్న యూట్యూబ్ వీడియోస్‌ను సత్కరించారు.

ఈ మేరకు యూట్యూబ్ టీమ్ ఇంచార్జ్ సిద్దార్థ్ సమక్షంలో వోల్గా వీడియోస్ సంస్థకు "యూట్యూబ్ డైమెండ్ బటన్" అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా వోల్గా వీడియోస్ సంస్థ అధినేతలు రవినాథ్, ప్రసాద్‌లను సగర్వంగా సత్కరించారు. ఈ అవార్డు ప్రధాననోత్సవ కార్యక్రమంలో... మెగా నటి నీహారిక కొణిదెల, ఆదిత్య ఆడియో సంస్థ అధినేత గుప్తాలు పాల్గొన్నారు. అనంతరం వోల్గా వీడియోస్ వారికి తమ అభినందనలను, శుభాకాంక్షలను తెలియచేశారు.

Next Story