పేదరికం ప్రతిభకి అడ్డంకి కాదు. రేసులో పరుగెత్తడానికి చెప్పులు లేవని ఆమె ఆలోచించలేదు. ఉన్నవస్తువులను తనకు అనుకూలంగా మార్చుకుంది. అందుకే ఇప్పుడు వార్తల్లో నిలచింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 11 ఏళ్ల ఎథెలెట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇలోఇలో ప్రాంతంలోని ఒక పాఠశాలలో ఇంటర్ స్కూల్ ఎథెలెట్స్ మీట్ జరిగింది. దీనిలో 11 ఏళ్ల రియా బులోసా తన కాళ్లకు షూ వేసుకోకుండా స్కూలు తరపున 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంది. ఈ మూడు కేటగిరీల్లోనూ గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్ కోచ్ ఫ్రెడరిక్ బీ వెలెన్జుఎలా షోషల్ మీడియాలో రియా సాధించిన విజయ గాథను షేర్ చేశారు. అయితే ఫ్రెడెరిక్ షేర్ చేసిన ఫొటోలో రియా పాదాలకు షూ లేదు. బ్యాండేజీనే ఆమె షూ లా కట్టుకొని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు ఆ బ్యాండేజీ మీద ప్రముఖ షూస్ కంపెనీ పేరు ‘నైక్’ను రాసుకుంది. ఈ పోస్టును చూసిన నైక్ తో సహా పలువురు నెటిజన్లు రియాకు కొత్త షూస్ ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, నైక్ షూ వేసుకోవాలన్న తన కోరిక తీరాలంటూ ట్వీట్ చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.