వాట్సాప్‌లో మరో కీలక ఫీచర్
By సుభాష్ Published on 23 Oct 2020 3:18 PM ISTవాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్ చాటింగ్, అలర్ట్ తో విసిగిపోయిన యూజర్లకు కొత్త అప్‌డేట్ తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్‌తో ఎప్పటికి మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్‌లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని అధికారిక ట్విట్‌లో తెలిపింది.
అయితే వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపుల నుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇది ఎంతగానో సహయపడుతోంది. చాట్‌ను మ్యూట్ చేసేస్తే సంబంధిత గ్రూపుల నుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు.. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేసేందుకు అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.