యోగ గురు బిక్రమ్ చౌదరి కామకేళిని, రేప్ లను, లైంగిక వేధింపులను బట్టబయలు చేసే సుప్రసిద్ధ డాక్యుమెంటరీ “బిక్రమ్ – యోగి, గురు, ప్రిడేటర్” చిక్కుల్లో కాపీరైట్ ఇరుక్కుంది. కోల్ కతా లోని ఘోష్ యోగా కాలేజీ, ఆ కాలేజీ ఎంబాసిడర్ ఇడా పంజుమన్, బుధ్ధఘోష్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ బిష్ణు ఘోష్, యోగానంద అనే పుస్తకాన్ని వ్రాసిన జెరోమ్ ఆర్మ్ స్ట్రాంగ్ లు తమ వద్దనున్న ఫోటోగ్రాఫులను అనుమతి లేకుండా వాడుకున్నారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించారు. కనీసం తమ నుంచి ఈ ఫోటోలు తీసుకున్నట్టుగా కూడా వారు తమ డాక్యుమెంటరీలో వెల్లడించలేదని వారు ఆక్షేపించారు.

మరో వైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగ గురు లాస్ ఏంజిల్స్ లో కేసు ఓడిపోయి ఏడు మిలియన్ డాలర్ల పరిహరం చెల్లించలేక అమెరికా వదిలి పారిపోయాడు. ఈ జనవరిలో బిక్రమ్ లెగసీ టూర్ పేరిట జనవరిలో పలువురు అమెరికన్లను తీసుకుని భారత్ లో తీర్థయాత్రలు చేయనున్నాడు.

ఈ డాక్యుమెంటరీని గత సెప్టెంబర్ లో టోరంటోలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ లో కూడా నవంబర్ 20 నుంచి లభ్యమౌతోంది. ఈ డాక్యుమెంటరీ నిర్మాత, సీ ఈ వో థామస్ బెన్స్ కీ కి ఇడా పంజుమన్, జెరోమ్ ఆర్మ్ స్ట్రాంగ్ లు ఈ చిత్రంలో తమ నుంచి వాడుకున్న ఫోటోలకు, చిత్రాలకు గాను తమ పేర్లను ఎక్కడా ఇవ్వలేదని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని నవంబర్ 29 న ఒక లేఖ వ్రాశారు. ఇప్పటి వరకూ నిర్మాతలు దీనిపై స్పందించినట్టుగా లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.