పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ సమీక్ష

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 10:39 AM GMT
పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ సమీక్ష

అమరావతి : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో సమీక్ష ఏర్పాటు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సమావేశం గరువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సి ఉంది. అయితే.. ‘నాడు-నేడు’ చేపట్టిన నేపథ్యంలో శుక్రవారానికి వాయిదా వేశారు.

Next Story
Share it