చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫైర్‌

By Newsmeter.Network  Published on  28 Nov 2019 8:30 AM GMT
చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫైర్‌

అమరావతి: చంద్రబాబు పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను చంద్రబాబు తన బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించారు. ప్యాకేజీలో దళితులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పిన తరువాతే చంద్రబాబు పర్యటించాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమరావతిలో బాబు శంఖుస్థాపన చేసిన.. నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి. అమరావతి పర్యటన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల భూములు ఏ విధంగా తన మనుషులకు దోచిపెట్టారో చెప్పి చంద్రబాబు పర్యటన కొనసాగించాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని పేరుతో కౌలు రైతులు, చేతి వృత్తిదారులకు చంద్రబాబు అన్యాయం చేశారని అన్నారు.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని ఆర్కే అన్నారు. బాబు హయాంలో రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత భవనం నిర్మించలేదని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 1500 రూపాయిలు అవుతుంటే, చంద్రబాబు తన బినామీ కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు 15 వేల రూపాయిలు ఎలా ఇచ్చారో చెప్పాలని ఆయన అన్నారు.

Next Story
Share it