వైసీపీ ఎమ్మెల్యే కారుపై ప్రత్యర్థుల దాడి

By సుభాష్  Published on  21 Feb 2020 3:58 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే కారుపై ప్రత్యర్థుల దాడి

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై ప్రత్యేర్థులు దాడికి పాల్పడ్డారు. కోటప్పకొండ మార్గంలో అర్థరాత్రి ఒంట గంటకు ఈ దాడి జరినట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి పండగ సందర్భంగా ఎమ్మెల్యే రజనీ మరిది గోపి కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారని దుండగులు రాళ్లు, కర్రలతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. తీరా చూస్తే కారులో ఎమ్మెల్యే లేరని, ఆమె భర్త కుమారస్వామి, మరిది గోపి మాత్రమే ఉన్నారని తెలియడంతో ప్రత్యర్థులు షాక్‌కు గురయ్యారు.

కారు మొత్తం ధ్వంసం అయింది. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో భర్త కుమారస్వామి, మరిది గోపితో పాటు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా, కారుపై టీడీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఉంటే చంపేసేవారమని, ఆమె లేకపోవడంతో ప్రాణాలతో దక్కిపోయారని టీడీపీ కార్యకర్తలు అన్నట్లు వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story