అమరావతి: మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై ఉన్న ఆరోపణలు, కేసులకు సంబంధించిన వివరాలతో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపింది. మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. యరపతినేని మీద ఉన్న ఆరోపణలపై రాష్ట్రస్థాయిలో సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు సీబీఐకి అందజేసినట్లు సమాచారం. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి పునరుద్ధరించిన తర్వాత ఆ శాఖకు అప్పగించిన తొలి కేసు ఇది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.