న్యూజిలాండ్ లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా, లేజర్ షో వెలుగుల్లో కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు న్యూజిలాండ్ వాసులు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ లోని అక్లాండ్ లో న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. 5-10 నిమిషాల వరకూ బాణ సంచా కాలుస్తూ, లేజర్ షో వెలుగుల్లో డాన్సులు వేస్తూ..డిస్కోల్లో ఎంజాయ్ చేస్తూ నయాసాల్ కు స్వాగతం పలికారు. న్యూజిలాండ్ తర్వాత భారత కాలమానం ప్రకారం ఆస్ర్టేలియాలో న్యూ ఇయర్ వేడుకలు మొదలు కానున్నాయి.

అక్లాండ్ కన్నా ముందుగా కిరిబటి, సమోవా, క్రిస్మస్ ఐలాండ్ లలో భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, ఛతామ్ ఐలాండ్స్ లో 3.45 గంటలకు న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. అలాగే మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు రష్యాలో, 6.30 గంటలకు ఆస్ర్టేలియాలో, 7 గంటలకు ఆస్ర్టేలియాలోని అడేలైడ్, బ్రోకెన్ హిల్, 7.30 గంటలకు బ్రిస్ బేన్, పోర్ట్ మోర్స్ బై, హగట్న,లో, 8 గంటలకు నార్త్ ఆస్ర్టేలియాలోని డార్విన్, అలైస్ స్ర్పింగ్స్, టెన్నట్ క్రీక్ లలో, 8.30 గంటలకు జపాన్, సౌత్ కొరియాల్లో,9.30 గంటలకు చైనా, పిలిప్పైన్స్ లోని బీజింగ్, హాంకాంగ్, మనీల, సింగపూర్ లలో, 10.30 గంటలకు ఇండోనేషియా, థాయ్ లాండ్, జకార్త, బ్యాంకాంగ్, హనోయ్ లలో, 11 గంటలకు మయన్మార్, కోకోస్ ఐలాండ్ లలో, 11.30 గంటలలో బంగ్లాదేశ్ లో, 11.45 కి నేపాల్ లో, 12 గంటలకు ఇండియా, శ్రీలంకలలో నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి.

భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీన

భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ బుధవారం 12.30 గంటలకు పాకిస్తాన్ 1 గంటలకు ఆప్ఘనిస్తాన్, 1.30 గంటలకు దుబాయ్, మస్కట్ లలో, 2 గంటలకు ఇరాన్ లో, 2.30 గంటలకు మాస్కో, రష్యా, బాగ్ధాద్, నైరోబి, 3.30 గంటలలకు గ్రీస్, 4.30 గంటలకు జర్మనీలో, 5.30 గంటలకు లండన్ (యు.కె)లో, 6.30 గంటలకు కాబో వర్దేలో, 7.30 గంటలకు బ్రెజిల్, 8.30 గంటలకు అర్జెంటీనా, 9.30 గంటలకు కెనడా, 10.30 గంటలకు న్యూ యార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్, హవానా, 11.30 గంటలకు మెక్సికో, చికాగో సిటీలలో, 12.30 గంటలకు ఫోనిక్స్, డెన్వర్ లలో, 13.30 గంటలకు లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ వేగాస్ లో , 14.30 గంటలకు అలాస్కా, 15 గంటలకు ఫ్రెంచ్ పాలినేషియాలో, 15.30 గంటలకు యూఎస్ఏ లోని హొనొలులు, రారొతొంగా, అడాక్, పాపేటి, 16.30 గంటలకు అలోఫి, మిడ్ వే, పాగొ పాగొ లలో, 17.30 గంటలకు బేకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్ లలో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి.

నూతన సంవత్సరానికి గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్న ప్రధాన నగరాలు సిద్ధమయ్యాయి. న్యూ ఇయర్ అంటే ఇండియాలో గుర్తుచ్చేది రంగులతో ముగ్గులు. సంక్రాంతి నెల మొదలు కొని ఆడపడుచులు వాకిళ్లలో చుక్కల ముగ్గులు పెట్టడం ఆనవాయితీ. అలాగే నూతన సంవత్సరానికి మగరాయుళ్లు తాగి, చిందులేస్తే స్వాగతం పలికితే మహిళలు, చిన్నారులంతా రంగులతో ముగ్గులద్ది స్వాగతం చెప్తారు. తెలుగు రాష్ర్టాల్లోని విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, ముఖ్యంగా హైదరాబాద్ లోని పబ్ లు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యాయి. ఇవి చాలక నగరంలో నిర్వహించే ఈవెంట్లు కోకొల్లలు. వీటికి కూడా ఆంక్షలున్నాయి. గీత దాటితే దెబ్బ పడుద్ది అంటున్నారు పోలీసులు. తాగి యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వారికి హాని చేయాలని చూసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

రాణి యార్లగడ్డ

Next Story