2020లో జియోమార్ట్..ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం

By రాణి  Published on  31 Dec 2019 12:19 PM GMT
2020లో జియోమార్ట్..ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం

టెలికాం రంగంలో జియోను అందుబాటులోకి తీసుకురావడంతోనే పెను మార్పులకు తెరలేపారు రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ. జియో రాకతో మిగతా టెలికాం సంస్థలన్నీ అప్పట్లో అధః పాతాళంలోకి వెళ్లిపోయినంత పనైంది. ఈ మధ్యకాలంలోనే జియో టు జియో కాల్స్ మాత్రమే ఫ్రీ గా ఇచ్చి..మిగతా నెట్ వర్క్ లకు కాల్ చేయాలంటే స్పెషల్ టాప్ అప్ రీఛార్జ్ చేసుకోవాల్సిందేనని ప్రకటించడంతో జియో యూజర్లు తగ్గుతున్నారు. అయినా ముఖేష్ అంబానీకి వచ్చిన నష్టమేమీ లేదండోయ్. ఆయన వ్యాపార లావాదేవీలు బాగానే సాగుతున్నాయి. ఇప్పుడు ఆయన చూపు ఈ కామర్స్ పై పడింది. 2020లో జియోమార్ట్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలిసిన ఈ కామర్స్ సంస్థలన్నీ తమ జాగ్రత్తలో ఉంటున్నాయి.

జియో నెట్ వర్క్ సిమ్ వచ్చినపుడు టెలికాం రంగంలో ఇతర నెట్ వర్క్ లు ఎంతలా కుంగిపోయాయో..జియో మార్ట్ వస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు కూడా ఆ స్థాయిలో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ముంబై, థానే, కల్యాణ్ నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి..ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరపనున్నారట. దీనికోసం త్వరలోనే జియోమార్ట్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story