పొగాకు వినియోగించే వారి సంఖ్య తగ్గుతుంది..

By Newsmeter.Network  Published on  29 Dec 2019 12:56 PM GMT
పొగాకు వినియోగించే వారి సంఖ్య తగ్గుతుంది..

చాలా సంవత్సరాలుగా ప్రాణాంతకమైన పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే మగవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది . అయితే ఇప్పుడు మొదటిసారిగా పొగాకు పరిశ్రమల పై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం వలన పురుషులు పొగాకు వాడకం క్షిణించడం మనం చూస్తున్నాము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ 'టెడ్రోస్ అధనాం ఘెబ్రేయేసస్' ఓ నివేదికలో తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కొత్త నివేదికలో సిగరెట్లు, సిగార్లు మరియు నమిలే పొగాకును లెక్కలోకి తీసుకున్నారు.

ప్రపంచంలో పొగాకు వాడకం 2000లో 139 కోట్ల వినియేగదారుల నుండి 2018లో 133 కోట్లకు తగ్గింది దీని అర్ధం ప్రపంచ జనాభా పెరిగినప్పటికీ 6 కోట్ల మంది తక్కువగా పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని. పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే మహిళల సంఖ్య కూడా 2000 లో ను 34.6 కోట్ల నుడి 2018 లో 24.4 కోట్లకు తగ్గిందని. ఇక ముందు పురుష వినియెగదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఈ నివేదిక సూచిస్తుందని. ఆగ్నేయాసియా దేశాలలో అత్యధికంగా పొగాకును ఉపయోగించుకుంటున్నాయి అని ఈ నివేదిక తెలుపుతుంది.

Next Story