రివ్యూ : 'వరల్డ్ ఫేమస్ లవర్' - లవ్ తక్కువ గొడవ ఎక్కువ !

By రాణి  Published on  14 Feb 2020 6:55 AM GMT
రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవర్ - లవ్ తక్కువ గొడవ ఎక్కువ !

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్స్‌ గా ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతున్న సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

గౌతమ్(విజయ్ దేవరకొండ) కాలేజీ డేస్ నుంచే రైటర్ కావాలని బుక్స్ రాయటం స్టార్ట్ చేస్తాడు. అలాగే యామిని(రాశీ ఖన్నా)ను కాలేజ్ లోనే ప్రేమిస్తాడు. కానీ వారి పెళ్లికి యామిని ఫాదర్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఈ క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, అపార్ధాలు కారణంగా యామిని గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో గౌతమ్ ఆమె వెంట పడుతూ కన్వీన్స్ చేయటానికి ట్రై చేస్తాడు. ఈ మధ్యలో భార్య భర్తలైన శీనయ్య(విజయ్) మరియు సువర్ణ(ఐశ్వర్య రాజేష్)ల కథ నడుస్తోంది. వారి కథలో ఉన్న సమస్య ఏమిటి ? ఈ కథలో (స్మిత)క్యాథెరిన్ ఎందుకు వస్తోంది ? అలాగే ఈజా (ఇసబెల్లా) కథ ఏమిటి ? ఆమెకు గౌతమ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఈ కథలు నిజమా ? కల్పితమా ? చివరికి యామిని - గౌతమ్ ఒక్కటవుతారా ? లేదా ? అనేది మిగతా కథ.

నటీనటులు :

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ అండ్ విజయ్ - హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అలాగే క్రాంతి కుమార్ దర్శకత్వ పనితనం, లవ్ ఎపిసోడ్లు, సాంగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ఎప్పుడూ నాలుగు వేరియేషన్స్ లో కనిపించిన విజయ్ తన పాత్ర‌కు ప్రాణం పోసాడు. తన మార్క్ నటనతో మరియు మాడ్యులేషన్ అండ్ టైమింగ్‌ తో

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాలోనే విజయ్ దేవరకొండ హైలెట్ గా నిలిచాడు.

ఇక విజయ్ వైఫ్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ ఐశ్వర్య నటన ఆమె పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. అలాగే రాశి ఖన్నా నటన సింప్లీ సూపర్బ్.. విజయ్ - రాశిల కెమిస్ట్రీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే ఎమోషనల్ సీన్ లో ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా తమకిచ్చిన చిన్న పాత్రల్లో నటించడానికి ఓ ప్రయత్నం అయితే చేశారు. అయితే కొన్ని లవ్ సీన్స్ లో ఇసబెల్లా తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కీలక సన్నివేశాల్ని చాలా బాగా పండించింది. అలాగే హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్స్ లో చాల బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు భరత్ కమ్మ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. దానికి తోడు విజయ్ దేవరకొండ మార్క్ సీన్స్ అండ్ కామెడీ ఈ సినిమాలో పెద్దగా క‌నిపించ‌వు. సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లు మిస్ అయ్యాయి. పైగా సినిమాలో మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో.. కానీ దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దానికితోడు సెకెండ్ హాఫ్ కాస్త స్లోగా, లెంగ్తీగా సాగడం కూడా సినిమాకు మైనస్‌ పాయింట్స్ గా నిలుస్తాయి.

సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

ఫ్యూ బోల్డ్ సీన్స్,

విజయ్ దేవరకొండ నటన,

విజయ్ - హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ

మైనస్ పాయింట్స్ :

స్లో సాగే కథనం,

నమ్మశక్యం కాని కథ,

స్క్రీన్ ప్లే బోర్ గా సాగడం,

అర్జున్ రెడ్డి షేడ్స్,

విషయం లేని పాత్రలు

తీర్పు :

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం కాస్త స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. అయితే లవ్ ట్రాక్ లో మంచి ఫీల్ తో మరియు డీసెంట్ ఎమోషన్ తో కొంతవరకు బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్, ఐశ్వర్య మరియు రాశీ ఖన్నాల మధ్య ఎమోషనల్ ట్రాక్స్ బాగున్నాయి. కానీ దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఓవరాల్ గా సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

రేటింగ్ : 2.25

Next Story