భావాలెన్నో తెలిపే ఎమోజీ..

By సుభాష్  Published on  17 July 2020 9:15 AM GMT
భావాలెన్నో తెలిపే ఎమోజీ..

ఎమోజీలు అంటే మనం చెప్పకుండానే ఎన్నో రకాలుగా అర్థాలు వచ్చే చిన్న చిన్న బొమ్మలు. ఈ ఎమోజీలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువగా వాడుతుంటారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ఇవే కాకుండా ఆశ్చర్యం, ఆనందం, కోపం, సిగ్గు, బాధపడటం, వెటకారం, ఇలా రకరకాల భావాలతో ఎన్నో అర్థాలు వచ్చే ఎమోజీలు వాడుకలో ఉన్నాయి. సోషల్‌ మీడియా సంస్థలు సైతం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రకరకాలుగా ఎమోజీలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇక తాజాగా కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు ఉండమని చెప్పే ఎమోజీలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

జూలై 17న వరల్డ్‌ ఎమోజీ డే సందర్భంగా పలు రకాల సంస్థలు రకరకాల ఎమోజీలతో కూడిన ఫోటోలను సైతం ట్విట్టర్‌అకౌంట్‌ లు నింపేశాయి. గూగుల్‌ ఇండియా, అమూల్‌, ఐరాస లాంటి సంస్థలు కొన్ని ఎమోజీలను తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాయి.



వరల్డ్ ఎమోజీ డే చరిత్ర

మొదటి సారి ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ 1862లో తన ప్రసంగంలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో కొందరు టైపోగ్రాఫర్లు లింకన్‌ ప్రసంగంలో ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాల పక్కన కన్ను గీటే సైగ ఎమోజీని వాడారు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటి సారిగా అబ్రహం లింకన్‌ ఎమోజీని వాడారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కాలంలో వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ వంటి యాప్స్‌ ఈ ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. అలాగే మనలో కలిగే అనేక భావాలను ఎదుటి వారికి స్పష్టంగా తెలియజేసేందుకు ఇవి ఉపయోగపడాయి. 1999లో జపాన్‌కు చెందిన షిగెటకా కురిటా రూపొందించారు. మొదటి 175 పిక్సల్‌ ఎమోజీలను యాహూ మెసేంజర్‌లో పంపిన ఆయన అత్యంత పురాతన మెయిన్‌ స్ట్రీమ్‌ ఎమోజీని ఉపయోగించారట. దీంతో 2010లో ఎమోజీ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చింది. అలాగే 2014లో లండర్‌కు చెందిన జెరెమీ బర్గ్‌ అనే వ్యక్తి ఈ వరల్డ్‌ ఎమోజీ డేను ప్రారంభించారు. దీంతో ప్రతియేటా జూలై 17న వరల్డ్‌ ఎమోజీ డేగా పాటిస్తున్నారు.



Next Story