ఆరో సారి వరల్డ్ కప్ ఆసీస్‌దే.. ఫైనల్‌లో భారత్ ఓటమి
వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమిండియాకు ఓటమి ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 4:06 PM GMTఆరో సారి వరల్డ్ కప్ ఆసీస్‌దే.. ఫైనల్‌లో భారత్ ఓటమి
వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమిండియాకు ఓటమి ఎదురైంది. తుదిపోరులో అభిమానులను భారత జట్టు నిరాశపరిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా ఆరోసారి వరల్డ్ కప్ ఆసీస్‌కు దక్కింది. భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది
టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఫీల్డింగ్‌లో అద్భుతంగా ప్రదర్శన చేస్తూ బౌండరీలను అడ్డుకుంది. బౌలర్లు కూడా భారత బ్యాటర్లను కట్టడి చేశారు. దాంతో.. మొదటి పది ఓవర్లు మినహా.. ఆ తర్వాత ఓవర్లలో పెద్దగా స్కోర్ రాలేదు. దాంతో.. 240 స్కోరుకు భారత్ ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మొదట తడబడింది. 47 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది. కానీ.. ఓపెనర్‌గా ఎక్కిన హెడ్ మాత్రం నిలకడగా ఆడాడు. ఆ తర్వాత లబుషేన్ కూడా స్లోగా ఆడినా హెడ్‌కు సహకరించాడు. హెడ్ (130; 120 బంతుల్లో) శతకంతో విజృంభించడంతో.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 43ఓవర్లలోనే 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. లబుషేన్ (58) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. బుమ్రాకు రెండు వికెట్లు, షమీ, సిరాజ్‌కు చెరో వికెట్ పడింది. నాలుగు
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చి నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కేల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54) అర్థ శతకాలు చేశారు. రోహిత్ శర్మ ఎప్పటిలాగే 31 బంతుల్లో 47 పరుగులు చేసి మంచి ఆరంభం అందించారు. స్టార్ బ్యాటర్లు గిల్ (4), అయ్యర్ (4), ఆల్‌రౌండర్ జడేజా (9), మరో బ్యాటర్ సూర్యకుమార్ (18) నిరాశపర్చారు. ఇక స్టార్క్‌కు మూడు వికెట్లు పడగా.. కమ్మిన్స్, హేజిల్‌వుడ్‌కు చెరో రెండు వికెట్లు పడ్డాయి. జంపా, మాక్స్‌వెల్ కూడా చెరో వికెట్ తీశారు. ఇక సెంచరీ చేసి ఆస్ట్రేలియాను గెలుపు తీరాలకు చేర్చిన హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఫైనల్‌కు ముందు ఒక్క ఓటమి లేకుండా వచ్చిన భారత్.. ఈసారి కచ్చితంగా కప్పు కొడుతుందని అందరూ భావించారు. కానీ.. చివరి మ్యాచ్‌లో అలా జరగలేదు. బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్ కుప్పకూలితే.. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా అనుకున్నంతగా రాణించలేకపోయారు. కొన్ని సమయాల్లో ఫీల్డింగ్ కూడా కట్టడి చేసేలా కనిపించలేదు. మరోవైపు ఆస్ట్రేలియా హెడ్, లబుషేన్ స్లోగా చూసుకుని ఆడటం.. ఆటను అర్థం చేసుకుని రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత్ గెలుస్తుందని.. కప్ మనదే అనుకున్న టీమిండియా అభిమానులు, భారతీయులకు నిరాశ తప్పలేదు.