PAK Vs SA: రిజ్వాన్, సౌతాఫ్రికా బౌలర్ మధ్య గొడవ (వీడియో)

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, సౌతాఫ్రికా పేసర్‌ మార్కొ జానెసన్‌ మధ్య గొడవ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  27 Oct 2023 12:15 PM GMT
world cup-2023, PAK vs SA, Heated conversation, Jansen, Rizwan,

PAK Vs SA: రిజ్వాన్, సౌతాఫ్రికా బౌలర్ మధ్య గొడవ (వీడియో)

క్రికెట్‌లో ఆటగాళ్లు ఎప్పుడూ క్రీడా స్ఫూర్తిని కనబరుస్తారు. అప్పుడప్పుడు మాత్రమే చిన్నచిన్న మాటలతో గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి దృశ్యాలు ప్రేక్షకులు చాలా తక్కువగా చూస్తుంటారు. అయితే.. తాజాగా వరల్డ్‌ కప్‌ టోర్నీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్తాన్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

భారత్ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ కొనసాగుతోంది. అయితే.. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్ తలపడుతోంది. పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌కు అత్యంత కీలకం. టోర్నీలో ముందుగా సాగాలంటే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిచి తీరాలి. ఇక సౌతాఫ్రికా మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ పవర్‌ ప్లేలో ఓపెనర్లు షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌-హాక్‌ వికెట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, సౌతాఫ్రికా పేసర్‌ మార్కొ జానెసన్‌ మధ్య ఈ గొడవ జరిగింది.

ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ఔటైన తర్వాత మహమ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. జానెసన్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రిజ్వాన్. తొలి బంతిని ఎదుర్కొన్న రిజ్వాన్‌ స్ట్రేయిట్‌ గా ఆడాడు. దాంతో.. క్యాచ్‌ జానెసన్‌కు వెళ్లింది. కానీ జానెసన్‌ ఆ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలం అయ్యాడు. ఇక ఆ తర్వాతి బంతిని రిజ్వాన్ బౌండరీ తరలించాడు. ఈ క్రమంలోనే జానెసన్‌ రిజ్వాన్ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. అందుకు బదులుగా రిజ్వాన్‌ నీ పని చేసుకో అన్నట్లుగా చేయి చూపించి సైగ చేశారు. దాంతో.. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటచేసుకున్నట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. వాగ్వాదంతో వెంటనే స్పందించిన బాబర్ ఆజాం, ఫీల్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకున్నారు. దాంతో గొడవ సద్దుమణిగింది. సౌతాఫ్రికాపై 27 బంతులను ఎదుర్కొన్న రిజ్వాన్‌ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు.

Next Story