IND Vs PAK: టాస్ గెలిచిన భారత్..టీమ్‌లోకి వచ్చేసిన గిల్
క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 9:00 AM GMTIND Vs PAK: టాస్ గెలిచిన భారత్..టీమ్‌లోకి వచ్చేసిన గిల్
World Cup-2023: క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అయితే.. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తుదిజట్టులో ఒక్క మార్పు మాత్రమే చోటుచేసుకుంది. ముందుగా ఊహించినట్లుగానే శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చేశాడు. దాంతో.. ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక తమ టీమ్‌లో ఎలాంటి మార్పులు లేవని.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.
కాగా.. వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు 7 సార్లు తలబడ్డాయి. మొత్తం ఏడు సార్లు కూడా భారతే పైచేయి చూపించింది. ఈ సారి కూడా ఆ రికార్డును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది భారత్. మరోవైపు వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. ఇక పాకిస్తాన్ తమకు భారత్‌పై ఉన్న చెత్త రికార్డును ఈసారైనా పోగొట్టుకోవాలని.. మ్యాచ్‌లో గెలవాలని భావిస్తోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్
ఈ మ్యాచ్ కోసం భారత్ లో ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని చోట్ల అయితే బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.