world cup-2023: టీమిండియాకు షాక్.. ఆల్‌రౌండర్‌కు గాయం
వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 4:19 PM ISTworld cup-2023: టీమిండియాకు షాక్.. ఆల్‌రౌండర్‌కు గాయం
వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. టాస్ గెలిచి తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. 9వ ఓవర్‌ను బౌలింగ్ చేసేందుకు వచ్చిన పాండ్య తొలి బంతిని డాట్ బాల్‌గా వేయగా.. తర్వాత రెండు బాల్స్‌కు బౌండరీలు సమర్పించుకున్నాడు. మూడో బాల్‌ను బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపే ప్రయత్నంలో జారి పడిపోయాడు. దాంతో.. కాలు బెనకడంతో టీమిండియా ఫీజియో వచ్చి పరీక్షించాడు. ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత కాసేపటికి బౌలింగ్‌కు సిద్ధమైనా.. గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. దాంతో.. మైదానాన్ని వీడాడు. ఈ ఓవర్‌లో మిగతా మూడు బాల్స్ విరాట్ వేసి ఓవర్‌ను పూర్తి చేశాడు.
కాగా.. చివరి మూడు బాల్స్ వేసిన కోహ్లీ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. గంటకు 103 కిలో మీటర్ల వేగంతో కోహ్లీ బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే.. హార్దిక్ పాండ్యా గాయం తీవ్రతపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని, స్కానింగ్ కోసం ఆసుపత్రికి కూడా తరలించామని బీసీసీఐ ప్రకటించింది. ఆల్‌రౌండర్‌గా టీమిండియాలో హార్దిక్ పాండ్యా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాకపోయినా.. ఇటు బౌలింగ్‌లో వికెట్లు తీస్తూ విజయాల్లో తన పాత్ర అందిస్తున్నాడు. అటు ఫీల్డింగ్‌లో కూడా అద్భుత ప్రదర్శనను కనిపిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో సత్తా చాటే హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు భారత జట్టులో మరొకరు లేకపోవడం గమనార్హం. ఇక భారత్ తదుపరి మ్యాచుల్లో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లతో తలపడాల్సి ఉంది. హార్దిక్ దూరమైతే టీమిండియాకు కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశాల లేకపోలేదు.
🚨 Update 🚨Hardik Pandya's injury is being assessed at the moment and he is being taken for scans. Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue pic.twitter.com/wuKl75S1Lu
— BCCI (@BCCI) October 19, 2023