World Cup-2023: కోలుకుంటున్న గిల్.. పాక్ మ్యాచ్‌లో ఆడతాడా..?
డెంగ్యూతో కొద్దిరోజులుగా బాధపడ్డ టీమిండియా ఓపెనర్ గిల్ కోలుకున్నాడ. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 12:41 PM IST. World Cup-2023: కోలుకుంటున్న గిల్.. పాక్ మ్యాచ్‌లో ఆడతాడా..?
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ అద్భుతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే.. ఈ టోర్నీకి ముందే టీమిండియా ఓపెనర్, స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దాంతో.. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. తాజగా.. శుభ్‌మన్ గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. రెండ్రోజుల క్రితం చెన్నైలోని ఆస్పత్రిలో చేరిన గిల్.. బుధవారమే డిశ్చార్జ్ అయ్యాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు గిల్ ప్లేట్‌లెట్స్ కౌంట్ సాధారణ పరిస్థితికి చేరుకుందని తెలుస్తోంది. అయితే.. తర్వాత టీమిండియా మ్యాచ్ దాయాది దేశం పాకిస్తాన్‌తో ఉంది. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడతాడా అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతోంది.
వరల్డ్ కప్-2023లో భాగంగా టీమిండియా అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మరో రెండ్రోజుల సమయం ఉంది. దాంతో.. శుభ్‌మన్ గిల్ పూర్తి కోలుకున్న సందర్భంగా ఆ మ్యాచ్‌లో గిల్ ఆడతాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. గిల్ జట్టుతో కలిసేందుకు ఇప్పటికే చెన్నై నుంచి బయల్దేరి అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. టీమిండియాతో కలిశాక కూడా మరో రోజు గిల్ ఆరోగ్యాన్ని బీసీసై వైద్యులు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత అతడు పాక్ మ్యాచ్‌లో ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
కాగా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు మరో రోజు సమయం ఉందని.. 14వ తేదీ వరకు గిల్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తాడని అభిమానులు భావిస్తున్నాడు. గిల్ డెంగ్యూ కారణంగా వరల్డ్ కప్-2023లో భారత్ ఆస్ట్రేలియా, అప్ఘాన్‌తో ఆడిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గిల్ లేకపోయినా రెండు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో ఓపెనర్లు రాణించలేకపోయినా.. అప్ఘాన్ మ్యాచ్‌లో మాత్రం రోహిత్ అదరగొట్టాడు. వీరబాదుడు బాది భారత్‌ను విజయ తీరానికి చేర్చాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ రోహిత్‌కు సపోర్ట్ చేస్తూ అప్పుడప్పుడు బౌండరీలు సాధిస్తూ ఫరవాలేదు అనిపించాడు. మరి ఈ నేపథ్యంలో పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్‌ను తీసుకుంటారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. మరోసారి గిల్ ఆరోగ్యం, ఫిట్‌నెస్ పరిశీలించాక బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకావం ఉంది.
మరోవైపు అహ్మదాబాద్ చేరుకున్న పాక్ ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. వరల్డ్‌కప్‌లో ఎప్పుడూ ఆదిపత్యం చెలాయిస్తున్న టీమిండియాను ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు.