world Cup-23: సచిన్, ఏబీడీ రికార్డ్స్‌ను అధిగమించిన వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు.
By Srikanth Gundamalla
world Cup-23: సచిన్, ఏబీడీ రికార్డ్స్‌ను అధిగమించిన వార్నర్
భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్-2023 జరుగుతోంది. ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. వరల్డ్ కప్‌లో వేగంగా 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా గతంలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు.
గతంలో సచిన్, డివిలియర్స్ వరల్డ్ కప్‌లో 1000 పరుగుల మార్క్‌ను 20 ఇన్నింగ్స్‌లలో అందుకున్నారు. కానీ.. వార్నర్ వారి రికార్డును బ్రేక్ చేశాడు. 19 ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు సాధించాడు. వీరి తర్వాత సౌరవ్ గంగూలీ, వివియన్ రిచర్డ్స్‌లు ఉన్నారు. 21 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగుల మార్క్‌ను దాటారు. ఇక మార్క్ వా, హెర్షెలే గిబ్స్‌లకు వరల్డ్ కప్‌లలో వెయ్యి పరుగులు దాటేందుకు 22 ఇన్నింగ్స్‌లు పట్టాయి. డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడతాడు. దాంతో.. ఈ ఫీట్‌ను సాధించాడు డేవిడ్ వార్నర్.
కాగా.. డేవిడ్ వార్నర్ తొలిసారి 2015లో వరల్డ్ కప్ ఆడాడు. ఆ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. 2015 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్సులు ఆడాడు. 8 మ్యాచుల్లో ఏకంగా 345 పరుగులు చేసి ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తాజగా.. 1000 పరుగుల మార్క్‌ను దాటి కొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్.