ODI World Cup-23: మ్యాచ్‌లకు వెళ్లే ప్రేక్షకులకు గుడ్‌న్యూస్

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్తున్న వారికి బీసీసీఐ కార్యదర్శి జై షా గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

By Srikanth Gundamalla
Published on : 5 Oct 2023 5:45 PM IST

ODI World Cup-23, Jay shah,  free mineral water,

ODI World Cup-23: మ్యాచ్‌లకు వెళ్లే ప్రేక్షకులకు గుడ్‌న్యూస్

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ ప్రారంభం అయ్యింది. భారత్‌ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఇండియాలో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువే అని చెప్పాలి. లైవ్‌లో మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అయితే.. స్టేడియంలో మ్యాచ్‌లు చూసేందుకు వెళ్తున్న వారికి బీసీసీఐ కార్యదర్శి జైషా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ప్రేక్షకులకు ఉచితంగా మినరల్, ప్యాకేజ్డ్‌ వాటర్ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు బీసీసీ నిర్ణయం తీసుకుందని జై షా వెల్లడించారు.

దేశంలో మ్యాచ్‌లు జరగనున్న అన్ని స్టేడియాల్లోనూ ఈ ఉచిత తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు. హైడ్రేట్‌గా ఉంటూ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేయాలని ఆయన దేశంలోని క్రికెట్‌ అభిమానులకు చెప్పారు. వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీని ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మార్చుకుందామని జై షా అన్నారు. కాగా.. వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు గురువారం నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ వన్డే టోర్నీలోని మ్యాచ్‌లు అన్ని భారత్‌లోనే జరగనున్నాయి. కాగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడింది భారత్. రెండు మ్యాచుల్లో గెలిచి టోర్నీని సొంతం చేసుకుంది.

అయితే.. అదే జోరును కొనసాగిస్తూ మొదటి మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లోనూ పటిష్టంగా ఉండి టీమిండియా. ఆటగాళ్లు అందరూ ఫామ్‌లో ఉండటం అందరినీ ఉర్రతలూగిస్తోంది. మరోవైపు భారత్‌ వేదిక కావడంతో సొంతగడ్డపై జరిగే టోర్నీ కప్‌ను గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇక.. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో భారత జట్టు నెంబర్‌ వన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల ఫామ్‌ను చూస్తున్న క్రికెట్‌ అభిమానులు ఈసారి కప్‌ మనదే అని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వరల్డ్‌ కప్‌లో జరిగే అన్ని మ్యాచుల్లో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

Next Story