World Cup-2023: ఆస్పత్రిలో చేరిన గిల్.. పాక్ మ్యాచ్‌లో ఆడతాడా?
డెంగీతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రిలో చేరాడు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:23 AM GMTWorld Cup-2023: ఆస్పత్రిలో చేరిన గిల్.. పాక్ మ్యాచ్‌లో ఆడతాడా?
భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ కొనసాగుతోంది. అయితే.. తొలి మ్యాచ్‌కు ముందే భారత్‌కు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే.. శుభ్‌మన్ గిల్ ఫాస్ట్‌గా కోలుకుని మళ్లీ మ్యాచ్‌లు ఆడతాడని భావించారు. కానీ.. అలా జరగలేదు. డెంగీ జ్వరం ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. దాంతో.. శుభ్‌మన్ గిల్ ఆస్పత్రిలో చేరాడు. దాంతో.. బుధవారం అప్ఘానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కూ గిల్ దూరం అవుతున్నాడు. కాగా.. బీసీసీఐ అప్ఘాన్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ బయలుదేరలేదని బీసీసీఐ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గిల్‌కు ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. కాగా.. శుభ్‌మన్ గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.
కాగా.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా శుభ్‌మన్ గిల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెంగీ వైరల్ ఫీవర్. ఇది ఒక్కసారి సోకింది అంటే.. తగ్గడానికి కాస్త సమయం పడుతుంది. మొదట గిల్‌కి ఈ లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు కాస్త ఎక్కువగా ఉండటంతో అతడు ఆస్పత్రిలో చేరాడు. మరోవైపు పాక్‌తో మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో.. గిల్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడితే అనుమానంగానే ఉంది. కాగా.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు దిగాడు. అయితే.. పాక్‌తో మ్యాచ్‌లో కూడా ఇషానే వచ్చే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలం అయిన విషయం తెలిసిందే. సింగిల్ డిజిట్‌కే మూడు వికెట్లు పడిపోయాయి. అయితే.. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్.. విరాట్‌తో కలిసి టీమిండియాను గెలిపించారు. చాలా కాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కావడంతో కప్‌ను కొట్టాలనే కసితో ఉంది భారత్. మరి ఓపెనర్‌గా రాణించిన శుభ్‌మన్ గిల్ త్వరగా కోలుకుని జట్టులోకి వస్తే బాగుంటుందని.. అతడి ఇన్నింగ్ టీమ్‌కు అవసరమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.