ప్రపంచ వ్యాప్తంగా 2,39,586 కరోనా మరణాలు

By సుభాష్  Published on  2 May 2020 1:49 PM GMT
ప్రపంచ వ్యాప్తంగా 2,39,586 కరోనా మరణాలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరణ మృదంగం మోగుతోంది. ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా సైతం అతలాకుతలం అయిపోతోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 2,39,586 మంది మృత్యువాత పడ్డారు. ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య 33.98కి చేరింది. అలాగే 10.80 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మృతుల వివరాలు:

యూఎస్‌ఏ 65,766
స్పెయిన్‌ 24,824
ఇటలీ28,236
యూకే27,510
ఫ్రాన్స్‌24,594
జర్మనీ6,736
టర్కీ3,258
రష్యా1,169
ఇరాన్‌6,091
బ్రెజిల్‌6,410
కెనడా3,391
బెల్జియం7,703
నెదర్లాండ్‌4,893
భారత్‌1,223
స్విట్జర్లాండ్‌1,754

ఇక కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా విషయంలో లాక్‌డౌన్‌ను పాటించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది.

Next Story