ప్రపంచ వ్యాప్తంగా 2,39,586 కరోనా మరణాలు
By సుభాష్Published on : 2 May 2020 7:19 PM IST

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరణ మృదంగం మోగుతోంది. ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా సైతం అతలాకుతలం అయిపోతోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 2,39,586 మంది మృత్యువాత పడ్డారు. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 33.98కి చేరింది. అలాగే 10.80 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మృతుల వివరాలు:
| యూఎస్‌ఏ | 65,766 |
| స్పెయిన్ | 24,824 |
| ఇటలీ | 28,236 |
| యూకే | 27,510 |
| ఫ్రాన్స్ | 24,594 |
| జర్మనీ | 6,736 |
| టర్కీ | 3,258 |
| రష్యా | 1,169 |
| ఇరాన్ | 6,091 |
| బ్రెజిల్ | 6,410 |
| కెనడా | 3,391 |
| బెల్జియం | 7,703 |
| నెదర్లాండ్ | 4,893 |
| భారత్ | 1,223 |
| స్విట్జర్లాండ్ | 1,754 |
ఇక కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా విషయంలో లాక్‌డౌన్‌ను పాటించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది.
Next Story