అమరావతి:ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ను నియమించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ నియమిస్తూ జీవో జారీ చేశారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు.. పోస్టులు.. డిజిగ్నేషన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. జీతాల చెల్లింపులు.. పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను వర్కింగ్ గ్రూప్ ఖరారు చేయనుంది. వచ్చే నెల 15వలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూప్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.