చదువుకున్న ఆడపిల్లవి..నువ్విలా చేయడం న్యాయమా ? పోలీస్ ప్రశ్న
By రాణి Published on 14 April 2020 2:22 PM GMTఅసలే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. ప్రజలను రక్షించేందుకు లాక్ డౌన్ గడువును పెంచారు. వైద్యులు, పోలీసులు కంటి మీద కునుకులేకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి కొందరు రోడ్లపై సిల్లీ రీజన్స్ చెప్తూ తిరుగుతున్నారు. కేవలం అబ్బాయిలే అనుకుంటే పొరపాటే. అమ్మాయిలు కూడా ఇలాంటి వాటికి ఏ మాత్రం తీసిపోవడం లేదు.
Also Read : మీ జన్ ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదా తెలియట్లేదా ? ఇలా చెక్ చేసుకోండి
తాజాగా ప.గో. జిల్లా జంగారెడ్డి గూడెంలో ఓ అమ్మాయి స్కూటీ పై వెళ్తూ పోలీసులకు దొరికిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని ఆ పోలీస్ ప్రశ్నించగానే తడబడుతూ, కాస్త సంకోచిస్తూనే పొంతనలేని సమాధానాలు చెప్పింది. మొదట పిన్నిగారింటి నుంచి మెడికల్ షాపుకు వెళ్తున్నానని చెప్పింది. తర్వాత ఏది ఏ మెడిసిన్ కోసం వెళ్తున్నావో చెప్పు అంటే నీళ్లు నమిలింది. బండి నేర్చుకుంటున్నావా ? అని ప్రశ్నిస్తే అప్పుడు..మా ఇంటికెళ్తున్నానని తెలిపింది. మీ పిన్నిగారింటికెందుకు వెళ్లావ్,సరదాగా వెళ్లావా అని అడగగా..ఆ వీరవనిత చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నంత పనైంది పోలీసులకి. ఇంతకీ ఎందుకెళ్లిందంటే వడియాలు ఆరబెట్టడానికంట.
Also Read : రావణుడికి పదితలలు ఉన్నట్లుగానే.. కరోనాకు పదకొండు..
ఇంత ఎమర్జెన్సీలో నువ్వు వడియాలు పెట్టడానికెళ్లావంటే నిన్ను ఏమనాలి ? చదువుకున్న ఆడ పిల్లవి. టీవీలో రోజూ కరోనా గురించి వార్తలు చూస్తున్నారు కదా. మరి నువ్విలా వడియాల కోసమని బయట తిరిగితే మేం నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు ? ఎందుకు కేస్ పెట్టకూడదు ? అని పోలీస్ అధికారి ఫైర్ అయ్యారు.
[video width="240" height="144" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/Woman-Went-to-her-Auntys-House-with-Silly-Reason.mp4"][/video]
నిజంగా చదువుకున్నవారే ఇష్టానుసారంగా రోడ్లపై తిరగుతున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలే కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. అపరిచితుల్ని గ్రాామాల్లోకి రానివ్వకుండా కంచెలు గోడలవుతున్నాయి.