మ‌హిళా కూలీపై ఉప స‌ర్పంచ్ అఘాయిత్యం

By Newsmeter.Network  Published on  17 Jan 2020 8:27 AM GMT
మ‌హిళా కూలీపై ఉప స‌ర్పంచ్ అఘాయిత్యం

అత‌ను ఓ గ్రామానికి ఉప స‌ర్పంచ్‌. గ్రామానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాడు పాడు ప‌నికి ఒడిగ‌ట్టాడు. ఒంటరిగా ఇంటికి వెలుతున్న మ‌హిళ పై అఘాయిత్యానికి య‌త్నించాడు. అయితే స‌మయానికి కొంద‌రు అక్క‌డ‌కి రావ‌డంతో బాధిత మ‌హిళ ఆ కామాంధుడి బారి నుంచి త‌ప్పించుకుంది. భద్రాద్రి జిల్లా బోనకల్లు మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ నెల 9వ తేదీనే జ‌ర‌గ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది ఘ‌ట‌న.

ఎస్సై కె.రఘు వెల్ల‌డించిన వివ‌రాలు ప్ర‌కారం ఈ నెల 9న‌ చిరునోముల గ్రామానికి చెందిన ఓ మహిళ పొలంలో పని చేసుకుని ఒంటరిగా ఇంటికి వస్తోంది. అదే సమయంలో చిరునోముల గ్రామ ఉప సర్పంచ్ పిడతల శంకర్‌ ఆమెపై అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. మ‌హిళ కేక‌లు విని చుట్టుపక్కల వారు అక్క‌డికి వ‌చ్చారు. వారిని చూసిన శంకర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

9న ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తర్వాత స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story
Share it