అర్ధరాత్రి మహిళ కిడ్నాప్ హాల్‌చల్
By Newsmeter.Network Published on 30 Nov 2019 7:02 AM GMTహైదరాబాద్ ఆరాంఘర్‌లో అర్ధరాత్రి ఓ మహిళ కిడ్నాప్ హల్‌చల్ చేసింది. వ్యాన్‌లో మహిళను ఎక్కించి తీసుకెళ్లారంటూ.. ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. మారుతీ ఓమ్నీ వ్యాన్‌లో వెళ్తున్న ముగ్గుర్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ.. వ్యాన్‌లో మహిళ లేకపోవండంతో పోలీసులు వ్యాన్‌లో ఉన్న ముగ్గురిని విచారిస్తున్నారు. అయితే ముగ్గురు అనుమానితుల్ని తెల్లవారేదాకా విచారించి పోలీసులు వదిలిపెట్టారు. వాహనాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్న పోలీసులు... అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని ముగ్గురు వ్యక్తులకు సూచించారు. ప్రస్తుతం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.