డెంగ్యూ జ్వరంతో మహిళా న్యాయమూర్తి మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 7:02 AM GMT
డెంగ్యూ జ్వరంతో మహిళా న్యాయమూర్తి మృతి

హైదరాబాద్‌: డెంగ్యూ జ‍్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం. జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్‌లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.

Next Story
Share it