నిండు గర్భిణి ఆమె. బాగా జ్వరంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లింది. అసలే కరోనా కంగారు పెడుతోంది. జ్వరం, జలుబు, పొడి దగ్గు కరోనా లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఆమెకు ఉండటంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆమె రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఈ విషయం తెలిసిన వారంతా కంగారు పడ్డారు. తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా కరోనా సోకుతుందనుకున్నారు. కానీ అలా జరుగలేదు. సోమవారం ఆమె బిడ్డకు జన్మనివ్వగా..బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

వివరాల్లోకి వెళ్తే..చైనాకు చెందిన ఓ మహిళ సోమవారం ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు కరోనా పాజిటీవ్ అని వైద్యులు తెలిపారు. అయితే ఆమె బిడ్డకు కూడా కరోనా వ్యాపిస్తుందని అనుకున్నారు. వైద్యులు కూడా ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. పుట్టిన బిడ్డకు రక్త పరీక్షలు చేయగా బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ చైనాలో 17,205 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 20 దేశాల్లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.