బ్రేకింగ్: రేపు తెలంగాణలో మద్యం షాపులు బంద్
By సుభాష్ Published on 21 March 2020 4:09 PM ISTకరోనా వైరస్ ఎఫెక్ట్ వైన్స్ షాపులపై పడింది. ఆదివారం జనతా కర్ఫ్యూకు మద్దతుగా తెలంగాణలో వైన్స్ షాపులు బంద్ పాటించనున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక కరోనాను ఎదుర్కొనే విధంగా భారతీయులందరు సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కర్ఫ్యూ పేరుతో స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని సూచన మేరకు వైన్స్ షాపులు కూడా బంద్ కానున్నాయి.
అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం మనహాయింపు ఇచ్చారు. అలాగే జనతా కర్ఫ్యూకు తెలంగాణ వైన్స్ డీలర్లు స్వచ్చంధంగా తమ మద్దతు ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ జనతా కర్ఫ్యూ కారణంగా మొత్తం 2వేల 400 వైన్స్ షాపులు బంద్ పాటించనున్నాయి చెప్పారు. ఇప్పటికే 700 బార్ షాపులు బంద్ అయినట్లు ఆయన పేర్కొన్నారు.