తహశీల్దార్ విజయను సురేష్ ఎందుకు సజీవ దహనం చేశాడు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 11:20 AM GMT
తహశీల్దార్ విజయను సురేష్ ఎందుకు సజీవ దహనం చేశాడు..?!

భూమి పాస్‌బుక్ ఇవ్వలేదని ఎమ్మార్వోను సజీవ దహనం చేశాడు సురేష్ అనే వ్యక్తి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌ గ్రామంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ను ఇవ్వాలని చాలా రోజులగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు సురేష్.ఎమ్మార్వో విజయ స్పందించక పోవడంతో పెట్రోల్‌ పోసి మంటలు అంటించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపు ఎమ్మార్వోతో వాగ్వాదం జరిగిన తర్వాతపెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది. ఆ మంటలు సురేష్‌కు కూడా అంటుకున్నా… బతికి బయటపడ్డాడు.

abdullapurmet

ఎమ్మార్వో విజయారెడ్డి పూర్తిగా కాలిపోయి… తన కార్యాలయంలోనే మరణించింది. విజయారెడ్డి ఎల్‌.బి నగర్‌లో నివాసం ఉంటుంది. పట్టపగలే పాశవికంగా దాడి చేసి హత్య చేయడాన్ని తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మార్వో డ్రైవర్ గుర్నాథం కాపాడే ప్రయత్నం చేసినా… ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఎమ్మార్వోల సంఘం తీవ్రంగా స్పందించింది. పాస్‌ బుక్‌లు ఇవ్వకపోవటంతోనే ఇంతటి దురాఘతానికి సురేష్ పాల్పడినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.

స్వస్థలం నల్లగొండ జిల్లా

పుట్టా సుభాష్ రెడ్డి భార్య విజయారెడ్డి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి. భర్త సుభాష్ రెడ్డి డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. విజయారెడ్డి 2009 గ్రూప్ 2 బ్యాచ్.

పుట్టా సుభాష్ రెడ్డి భార్య విజయారెడ్డి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి. భర్త సుభాష్ రెడ్డి డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. విజయారెడ్డి 2009 గ్రూప్ 2 బ్యాచ్.

మహేష్ భగవత్, రాచకొండ సీపీ

గవర్నమెంట్ ఆఫీస్‌లో జరగడం ఇది మొదటిసారి. ఆయన ఏ పరిస్థితుల్లో ఈ ఘటనకు పాల్పడ్డాడో చూడాలి. సురేష్ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్ 50 నుంచి 60శాతం కాలిపోయాడు. ఈయనే చేశాడా..? ఇలా చేయాలని ఎవరైనా చెప్పారా? అఏది విచారణ చేయాలి. ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లడానికి అనుమతి ఎవరు ఇచ్చారనేది విచారణ చేస్తున్నాం. ఇది మర్డర్ కేసు. పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. పాస్ట్ ట్రాక్ కోర్టులో పెడతాం.

బి .మహేష్ , మండల రెవెన్యూ అధికారి

మేడం ఇచ్చిన టాస్క్‌ పనిలో ఉన్నాం. ఒకరి తరువాత ఒకరిని అటెండర్ పంపిస్తున్నాడు. అతనిని ఎవరూ గమనించలేదు. లోపలికి పోయి గడిపెట్టుకున్నాడని తెలిసింది. మేడంకు అంటించిన తరువాత, ఈయన కూడా అంటించుకన్నట్లు తెలిసింది. కేకలు వినబడటంతో..వచ్చాం. ఏసీ, విండో పేలాయి. మేం పరుగెత్తి వచ్చే వరకు ..మేడం పడిపోయి ఉంది. నేనే అని మేడం చేయి చూపించారు. ఇది చాలా బాధాకరం.

Next Story