భూకంపం ఎందుకు వస్తుంది..?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..

By సుభాష్  Published on  29 Jan 2020 8:13 AM GMT
భూకంపం ఎందుకు వస్తుంది..?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..

భూకంపం వచ్చిందంటే చాలు అందరూ వణికిపోవాల్సిందే. ప్రకృతి కన్ను తెరిచి విలయతాండవం చేస్తుంది. భూకంప ధాటికి క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపం ఎందుకు వస్తుంది..? అందుకు కారణాలు లేకపోలేదు. కానీ సమాజంలో మాత్రం భూకంపాల మీద రకరకాల కట్టుకథలున్నా.. కథలుగానే మిగిలిపోయాయి. భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం కూడా చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా, అలాగే చెట్లను నరకడం వంటివి జరుగుతుండటంతో భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు.

రిజర్వాయర్లలో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. భూప్రకంపనల తీవ్రతను బట్టి నష్టం వాటిల్లులుంది.

భూమి లోపల అనేక పొరలు

భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే, ఆ పొరను ‘క్రెస్ట్‘ లేదా ‘లిథోస్పియర్‘ అంటారు. దాని కింద పొరను ‘మాంటక్‘ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పొలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8వేల డిగ్రీల సెల్పియస్. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్, క్రెస్ట్ లను చేధించుకొని బయటకు రావడం కొన్ని చోట్ల జరుగుతుంది. దీన్ని అగ్ని పర్వతం బద్దలైందని అంటుంటారు.

భూమి లోపల 12 కఠిన పొరలు

భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయి. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే అనేక నష్టం వాటిల్లుతుంది. ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైన క్రెస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుది. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పటంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపలు ఏర్పడే అవకాశాలుంటాయి. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి.

1906 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు, ప్రహరీగోడలు, ఇళ్లు ఇలా అనేకం 20 అడుగుల పక్కకు కదిలిపోయాయి. భారీ ఆనకట్ట వల్ల, అణు ప్రయోగాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ భూకంప సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది. సముద్రాలలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి.

భూ ప్రకంపనలు ఎలా గుర్తిస్తారు..?

భూప్రకంపనలు వచ్చిన సమయంలో ప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. రెండో శతాబ్దంలో చైనాలో మొట్టమొదటిసారిగా ‘సిస్మోగ్రాఫ్‘ను తయారు చేశారు. ఈ పరికరంలో స్ట్రింగ్ ల నుంచి స్థిరంగా వేలాడే బరువు ఉంటుంది. దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలు జత చేసి ఉంటుంది. ఈ సిస్మోగ్రాఫ్ వెనుకాల ఒక అద్దం ఉంటుంది. ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు వెనుకున్న అద్దాన్ని కదిలిస్తాయి. ఆ అద్దం నుంచి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం తిరిగే గుండ్రని డ్రిమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద పడుతూ ఉంటాయి. దీని వల్ల డ్రమ్ మీద ఉండే ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద చలించిన గీతలు ఏర్పడతాయి. ఈ విధంగా భూప్రకంపనలు శాస్త్రవేత్తలు గుర్తించగల్గుతున్నారు.

భూకంప తీవ్రతను రిక్టర్ పై ఎలా కొలుస్తారు..?

భూకంపాలు సంభవించిన సమయంలో దాని తీవ్రను గుర్తిస్తారు. కాగా, భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన ఛార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నారు. 3వేల 800 లీటర్ల పెట్రోలు ఇచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతుంది. అది రిక్టర్ స్కేలు మీద రూ. 2.5కు సమానం. ఇది కనుక ఆరు దాటితే భూకంప ప్రభావం అధికంగా ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఉహించగలవని రుజువు చేశారు.

Next Story