బిగ్ బాస్ -3 విజేత శ్రీముఖేనా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 6:44 AM GMT
బిగ్ బాస్ -3 విజేత శ్రీముఖేనా..?!

బిగ్ బాస్ సీజన్‌-త్రీ విజేత ఎవరు ..?ఇప్పుడీ క్వశ్చన్ సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ.. రచ్చ నడుస్తోంది . వైల్డ్ కార్డు ఎంట్రీ తో సహా టోటల్ 17 మంది కంటెస్ట్స్ తో స్టార్ట్ ఐన బిగ్ బాస్ 100 డేస్ కంప్లీట్ చేసుకుంది . ఇక ఆ ఇంట్లో ఐదుగురు ఉన్నారు . వన్ టైటిల్ వెర్సెస్ 5 కంటెస్ట్స్ ఫైట్ లో విజేత ఎవరన్నదానిపై ఇప్పటికే బిగ్ బాస్ ఫాలోయర్స్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది .

ఫినాలే ఫైటింగ్ లో శ్రీముఖి -రాహుల్-వరుణ్- బాబా భాస్కర్ -అలీ రెజా ఉన్నారు. వీరిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వైస్ చూసుకున్న పెర్ఫార్మ్ వైస్ చూసుకున్నా ఐదుగురిలో శ్రీముఖినే బెస్ట్ అంటున్నారు రాములమ్మ ఫాన్స్ . అంతేకాదు టోటల్ బిగ్ బాస్ ప్రయాణంలో శ్రీముఖి ఓ ప్లానింగ్ తో గేమ్ ను ఆడినట్లు తెలుస్తోంది . బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేముందే ఆమె ప్రణాళికతో వెళ్లినట్లు తెలుస్తోంది . బాబా తో స్నేహం ..రాహుల్ తో కయ్యం ..అలీతో కాస్త సరసం ..ఇలా ప్రతి అంశం ఓ లెక్క ప్రకారం శ్రీముఖి డిజైన్ చేసుకుని తన ప్లాన్ ను అమలు చేసినట్లు షో ఫాలో అయ్యేవాళ్ళకు ఇట్టే తెలిసిపోతుంది .

అంతేకాదు ..లాస్ట్ సీజన్ కౌశల్ ఆర్మీ లా తాను ఓ ఆర్మీని క్రియేట్ చేసి మరీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిందన్న రూమర్ కూడా ఉంది. సోషల్ మీడియా లో శ్రీముఖి ఆర్మీ ప్రస్తుతం తెగ హడావుడి చేస్తోంది . ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ ఓ గ్రూప్ కూడా క్రియేట్ అయింది .అంతేకాదు థియేటర్ లలో శ్రీముఖి పేరుతో యాడ్స్ కూడా ప్రత్యక్షమవుతున్నాయంటే ఎంత పక్కా ప్రణాళికతో శ్రీముఖి ఉందొ తెలిసిపోతుంది. ఇప్పుడు శ్రీముఖి టీం మరింత యాక్టీవ్ అయింది. రాములమ్మ ఆర్మీ పేరుతో శ్రీముఖి రాములమ్మ సిగ్నచర్ డాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముమ్మరంగా ప్రచారం కూడా చేస్తున్నారు .

శ్రీముఖికి పోటీగా రాహుల్ టీమ్ కూడా మరింత ప్రచారం చేస్తోంది. రాహుల్ ఆర్మీ పేరుతో సాంగ్ లు రీలీజ్ చేసి ఫాన్స్ ను ఆకట్టుంకునేందుకు ట్రై చేస్తున్నారు . ఇక రాహుల్-శ్రీముఖి తర్వాత గట్టి పోటీ ఇస్తున్న మరో సభ్యుడు వరుణ్ . ఇక బాబా భాస్కర్ -అలీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ వీరికున్న రేంజ్ లో లేదు. అందుకే టైటిల్ వేటలో శ్రీముఖి-రాహుల్- వరుణ్ మధ్యనే ఉంది. ఈ ముగ్గురిలో శ్రీముఖి వైపే ఫాన్స్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది . అంతే కాదు గత రెండు సీజన్లలో విన్ ఐన ఇద్దరూ మేల్ కంటెస్ట్స్. అందుకే మా టీవీ మానేజ్మెంట్ కూడా ఫిమేల్ కంటెస్ట్స్ కె ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం . ఈ లెక్కన శ్రీముఖినే ఈ సీజన్ విజేత గా నిలుస్తుందని అంచనాకు వస్తున్నారు బిగ్ బాస్ ఫాలోయర్స్

Next Story
Share it