ఐటీ దాడులు జ‌రిగాయ‌ని చెప్పింది ఎవ‌రు..?

By అంజి  Published on  23 Nov 2019 11:16 AM GMT
ఐటీ దాడులు జ‌రిగాయ‌ని చెప్పింది ఎవ‌రు..?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌ బాబు, హీరో వెంకటేష్‌, యువ కథానాయకుడు నానిలకు చెందిన ఆఫీసులు, నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించినట్టు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నివాసం, ఆఫీసుపైనా ఐటీ దాడులు జరిగినట్టు ప్రచారం జరిగింది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై నాగార్జున స్పందించారు.

ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మీ ఇంటిపై దాడి చేశారట కదా అని తనకు ఫోన్లు వస్తున్నాయని, తన స్నేహితులు కూడా అడుగుతున్నారని..? ఏంటి ఇది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఆఫీసు, ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులెవరూ దాడులు నిర్వహించలేదని నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా స్పష్టం చేశారు.

టాక్స్ కరెక్ట్‌గా పే చేసే వారికి సమ్మన్ అవార్డ్ అని ఒకటి ఇస్తారు. ఆ... అవార్డ్ నాగార్జున‌కి 2 టైమ్స్ ఇచ్చారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు. నాగార్జున టాక్స్ పే చేయ‌డంలో ఎంత క‌రెక్ట్ గా ఉంటారో. ఇలాంటి వ్య‌క్తి గురించి.. ఈ విధంగా ప్ర‌చారం చేస్తున్న‌ది ఎవ‌రో..?

Next Story