వైట్ ద్వీపంలో పేలిన అగ్నిపర్వతం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 12:59 PM GMT
వైట్ ద్వీపంలో పేలిన అగ్నిపర్వతం

న్యూజిలాండ్ : న్యూజిలాండ్ తీరానికి తూర్పు దిశగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైట్ ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఒక్కసారిగా పేలింది. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలడంతో అక్కడున్న వారంతా పరుగు లంకించారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో ఆ ప్రాంతంలో సుమారు 100 మంది ఉన్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు. వీరిలో కొంతమంది గల్లంతవ్వగా మరికొంతమందికి గాయాలయ్యాయని, సుమారు 5 గురు మృతిచెందినట్లుగా ఆయన వెల్లడించారు. సమాచారం తెలిసిన వెంటనే అక్కడి ప్రభుత్వం ప్రత్యేక విమానంలో వైద్య సిబ్బంది, ఇతర అధికారులను పంపించి. కాగా ప్రమాదానికి కొద్దిసేపటి క్రితం భూమిలో కదలికలను గమనించిన కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు న్యూజిలాండ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే వైట్ ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతంలో పలు మార్పులు వచ్చాయని, త్వరలోనే అది పేలే అవకాశాలున్నట్లు ఇటీవలే శాస్ర్తవేత్తలు హెచ్చరికలు కూడా జారీ చేశారట. ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని తెలిసి కూడా అక్కడికి పర్యాటకుల్ని ఎలా అనుమతించారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story